Google : గూగుల్‌కి 27ఏళ్లు! చిన్న ఆలోచన నుంచి కోట్లాది మంది రోజు వాడే సెర్చ్ ఇంజిన్ వరకు..
గూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది! ఈ నేపథ్యంలో అసలు గూగుల్ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సెర్చ్ దిగ్గజం 'గూగుల్' నేడు (సెప్టెంబర్ 27తో) 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది! ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా మెన్లో పార్క్‌లోని ఒక చిన్న గ్యారేజీలో పురుడు పోసుకున్న ఒక ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా మారింది.

ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గూగుల్ను ఉపయోగిస్తారు. నిజానికి, మీరు ఈ ఆర్టికల్‌ను గూగుల్ ద్వారానే చదవగలుగుతున్నారు! అయితే, 'గూగుల్' అంటే నిజంగా అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
'గూగుల్' అంటే ఏమిటి?
గూగుల్ అనేది గణితంలో ఉపయోగించే పదం 'గూగోల్' (Googol) పై చేసిన ఒక తెలివైన పద ప్రయోగం. 'గూగోల్' అంటే 1 తర్వాత వంద సున్నాలు ఉన్న సంఖ్యను లేదా 10 పవర్ 100ను సూచించే గణిత పదం.
ఈ 'గూగోల్' పదాన్ని గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర్ మేనల్లుడు మిల్టన్ సిరోట్టా సృష్టించారు.
అందువల్ల, గూగుల్ పేరు ద్వారా తమ సెర్చ్ ఇంజిన్ అపారమైన సమాచారాన్ని చూపించాలనే సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఆశయాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశించారు.
గూగుల్‌కు ఆ పేరు పెట్టడం వెనుక కథ..
ఈ సెర్చ్ ఇంజిన్ పేరు మొదట్లో గూగుల్ కాదు! స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థులైన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాన్ని గుర్తించి, దానిని ప్రారంభించాలనే ఆలోచన చేసినప్పుడు, వారి మనసులో అసలు గూగుల్ అనే పేరే లేదు!
గూగుల్‌కు మొదట్లో 'బ్యాక్‌రబ్' (BackRub) అని పేరు పెట్టారు.
అయితే 1997లో, ఒకరోజు లారీ పేజ్ సహోద్యోగి, ఆ గణిత పదం 'గూగోల్'ను తప్పుగా 'గూగుల్' (Google) అని ఉచ్చరించారు. అది అందరికి నచ్చింది. పైగా ఆ పేరుతో డొమైన్ అందుబాటులో ఉందని తెలుసుకున్నారు. ఇంకేముంది, కొన్ని గంటల్లోనే google.com వెబ్‌సైట్‌గా రిజిస్టర్ అయ్యింది.
అంటే, గూగుల్ అనేది ఒక గణిత పదాన్ని తప్పుగా పలకడం ద్వారా వచ్చిన పేరు! ఈ పేరుసంవత్సరాలుగా పెను మార్పులను (సునామీలను) సృష్టిస్తూ వస్తోంది.
గూగుల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
గూగుల్‌ను 1998లో స్టాన్‌ఫోర్డ్ పీహెచ్‌డీ విద్యార్థులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ప్రారంభించారు. కంపెనీ సెప్టెంబర్ 4, 1998న ప్రారంభమైంది.
అయితే గూగుల్ తమ అంతర్గత మైలురాళ్లను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 27న తమ పుట్టినరోజును జరుపుకుంటుంది.
గ్యారేజీ నుంచి సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన సంస్థ, ఇప్పుడు 2015లో స్థాపించిన హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్. పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా మారింది.
ప్రస్తుతం సుందర్ పిచాయ్గూగుల్, ఆల్ఫాబెట్‌లకు సీఈఓగా ఉన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



