Bihar Exit Poll Results 2025: బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఎన్డీయేకే పట్టం
బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2025 వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎన్డీయే విజయ భేరి మోగించనుందని తమ అంచనాలను ప్రకటించాయి.
బిహార్ అసెంబ్లీ 2025 ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాలు లైవ్ అప్‌డేట్స్
బిహార్ అసెంబ్లీ 2025 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఎన్డీయే విజయ భేరి మోగించనుంది.
...Read Moreబీహార్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్: అన్ని సంస్థల ఫలితాలు ఇవీ

యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్
యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ డేటా రేపు అంటే నవంబరు 12, బుధవారం విడుదల కానుంది.
పోల్ డైరీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఎన్డీయేకు 200కు పైగా సీట్లు
ఎన్డీయేకు 200కు పైగా సీట్లు వస్తాయని పోల్ డైరీ అనే సంస్థ ఎగ్జిట్ పోల్ ద్వారా అంచనా వేసింది. పోల్ డైరీ ప్రకారం మొత్తం 243 సీట్లలో ఎన్డీయే గరిష్టంగా 209 సీట్లు గెలుచుకోబోతోంది. ఎన్ డిఎ: 184-209 స్థానాలు మహాకూటమి: 32-49 స్థానాలు గెలుచుకుంటాయి.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎన్డీయేకు గరిష్టంగా 160 సీట్లు
ప్రముఖ హిందీ వార్తా పత్రిక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తేల్చింది. ఎన్డీయే కూటమికి 145 నుంచి 160 సీట్లు వస్తాయని తేల్చింది. మహా ఘట్‌బంధన్ కూటమికి 73 నుంచి 91, ఇతరులకు 5 నుంచి 10 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.
జర్నో మిర్రర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: మహా కూటమికి స్పష్టంగా ఆధిక్యం
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి గెలుస్తున్నట్లు జర్నో మిర్రర్ ఏజెన్సీ అంచనా వేసింది. ఈ ఎగ్జిట్ పోల్ లో 243 సీట్లకు గాను మహాకూటమికి 130 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా. అదే సమయంలో ఎన్డీయే మెజారిటీకి దూరంగా ఉండి 100 నుంచి 110 సీట్ల మధ్య కుంచించుకుపోతోంది. మహాకూటమి: 130-140 సీట్లు ఎన్డీయే: 100-110 సీట్లు ఏఐఎంఐఎం: 3-4 సీట్లు ఇతరులు: 0-3 సీట్లు
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఎన్డీయేకు అధికార పీఠం
బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితం LIVE: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కు సంబంధించి న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎన్డీయేకు మెజారిటీ వస్తుందని అంచనా. పార్టీల వారీగా సీట్ల అంచనా: ఎన్ డిఎలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి- బిజెపి: 55-65 జెడియు: 60-70 హెచ్ ఎఎం: 0-5 ఎల్ జెపి: 10-15 ఆర్ ఎల్ ఎం: 0-5 మహాకూటమిలో ఏ పార్టీలో ఎన్ని సీట్లు - ఆర్జేడీ: 50-60 కాంగ్రెస్: 15-20 సీపీఐ ఎంఎల్: 10-15 సీపీఐ: 0-5 సీపీఎం: 0-5 వీఐపీ: 0-5 ఐఐపీ: 00
పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయేకు 133 నుంచి 148 సీట్లు
పోల్ స్ట్రాట్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయే కూటమికి 133 నుంచి గరిష్టంగా 148 సీట్లు రానున్నాయి. మహా కూటమికి 87 నుంచి 102 సీట్లు, ఇతరులకు 2 నుంచి 5 సీట్లు దక్కనున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల సారాంశం (అన్ని ఏజెన్సీల ప్రకారం)
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ సంఖ్య 122 కాగా, ఎన్‌డీఏ కూటమికి దాదాపు 133 నుంచి 167 స్థానాలు లభించే అవకాశం ఉందని సగటున అంచనా వేశారు.
ఎన్‌డీఏ కూటమి: అన్ని ప్రధాన సర్వేలు ఎన్‌డీఏ కూటమి 133 నుంచి 167 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితం ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీని సూచిస్తుంది.
మహాకూటమి: తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి (ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి) 70 నుంచి 102 స్థానాల పరిధిలో వెనుకబడి ఉంటుందని అంచనా వేశారు.
జన్ సురాజ్ పార్టీ: ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (JSP), 0 నుండి 5 స్థానాలు మాత్రమే సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు.
బీహార్‌లో ఎన్‌డీఏకు స్పష్టమైన ఆధిక్యం.. అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ (NDA) కూటమి (బీజేపీ, జేడీయూ ప్రధానంగా) స్పష్టమైన ఆధిక్యత సాధించబోతోందని మంగళవారం విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 243 స్థానాలు ఉన్న సభలో మెజారిటీ మార్క్ (122)ను ఎన్‌డీఏ సునాయాసంగా దాటే అవకాశం ఉందని అంచనా.
పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎన్డీయేకు 142 నుంచి 162 సీట్లు
పీ- మార్క్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఎన్డీయేకు 142 నుంచి 162 సీట్లు లభించనున్నాయి. మహా కూటమికి 80 నుంచి 98 సీట్లు దక్కున్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీకి 1 నుంచి 4 సీట్లు లభించనున్నాయి.
జేవీసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఎన్డీయేదే ఘన విజయం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించనున్నట్టు జేవీసీ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఎన్డీయే కూటమికి 135 నుంచి 150 సీట్లు, మహా కూటమికి 88 నుంచి 103 సీట్లు, ఇతరులకు 3 నుంచి 7 సీట్లు లభించనున్నట్టు అంచనా వేసింది.
పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్: ఎన్డీయేకు 133 నుంచి 148 సీట్లు
పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే 133 నుంచి 148 సీట్లు గెలవనున్నట్టు అంచనాలు వెలువడ్డాయి. మహా కూటమికి 87 నుంచి 102 సీట్లు దక్కనున్నాయని అంచనా వేసింది. ప్రశాంత్ కిశోర్ పార్టీకి సున్నా నుంచి 2 సీట్ల వరకు, ఇతరులకు 5 సీట్ల వరకు దక్కవచ్చని అంచనా వేసింది.
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్: ఎన్డీయే ఘన విజయం
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ప్రకారం ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించనుంది. ఎన్డీయే కూటమి 147 నుంచి 167 సీట్లు గెలుచుకోనుంది. మహా కూటమికి కేవలం 70 నుంచి 90 సీట్లు దక్కనున్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీకి 5 సీట్లు దక్కనున్నాయని అంచనా.
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్: ఎన్డీయేదే ఘన విజయం
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ 71 సీట్ల లెక్కలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని అంచనా. తొలిసారి ఎన్నికల ఇన్నింగ్స్ ఆడుతున్న ప్రశాంత్ కిషోర్ తీవ్ర వైఫల్యం ఎదురు చూడనున్నట్టు తెలుస్తోంది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ లో ఇప్పటి వరకు విడుదల చేసిన 71 సీట్ల ప్రకారం, ఎన్డీయేకు 50-55, మహాకూటమికి 18-23, జన్ సూరజ్ 0-1, ఏఐఎంఐఎంకు 0 సీట్లు, ఇతరులకు 0 సీట్లు వస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం సీట్ల సంఖ్య 243.
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: తొలి విడతలో ఎన్డీయేకు 60 నుంచి 70 సీట్లు
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం తొలి విడతలో 121 సీట్లలో ఎన్డీయేకు 60 నుంచి 70 సీట్లు, మహాకూటమికి 45 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు తమ ఖాతాలో ఒక్క సీటు కూడా పొందినట్లు చూపించలేదు. మొదటి దశలో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ ఖాతాను కూడా తెరవడం లేదని సర్వేలో పేర్కొంది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మొదటి దశలో 35-45 సీట్లు గెలుచుకోవచ్చు, ప్రతిపక్ష ఆర్జేడీకి 25-35 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 20-30 సీట్లు, కాంగ్రెస్‌కు 5-10 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తెలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) కు 0-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మూడు వామపక్షాలకు 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇవి సర్వే గణాంకాలు మాత్రమే. నవంబర్ 14న తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్: ఎన్డీయేకే పట్టం
బీహార్ ఎగ్జిట్ పోల్: ఈసారి బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోందని ఏబీపీ న్యూస్ తెలిపింది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని అంచనా. బీజేపీకి 65-73 సీట్లు, జేడీయూకు 67-75, ఎల్జేపీకి 7-9, హెచ్ఏఎం 4-5, ఆర్ఎల్ఎంకు 1-2 సీట్లు వస్తాయని తెలిపింది. అదే సమయంలో మహాకూటమి కి 70-89 సీట్లు వస్తాయని అంచనా. ఇందులో ఆర్జేడీకి 53-58 సీట్లు, కాంగ్రెస్ 10-12, వీఐపీకి 1-4, వామపక్షాలకు 9-14 సీట్లు వస్తాయని అంచనా.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు: ఎన్డీయేదే గెలుపు
బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలకు గాను ఎన్‌డీఏ 133 నుంచి 159 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ (122)ను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన 'మహిళా రోజ్‌గార్ యోజన' పథకంలో భాగంగా కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడమే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని సర్వే పేర్కొంది.
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య ఎంత? బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ వివరాలు
బీహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఎన్నికల్లో కనీసం 122 స్థానాలు గెలుచుకోవాలి. ఈ సంఖ్యనే సాధారణ మెజారిటీ (Simple Majority) లేదా మ్యాజిక్ ఫిగర్ అంటారు
67 శాతం పోలింగ్
బీహార్ ఎగ్జిట్ పోల్ లైవ్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 లో అన్ని ఓటింగ్ రికార్డులు బద్దలయ్యాయి. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 67 శాతం పోలింగ్ నమోదైంది.
ముగిసిన పోలింగ్
బీహార్ ఎగ్జిట్ పోల్ LIVE: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు చివరి దశ పోలింగ్ జరిగింది. ఓటింగ్ పూర్తయిన తర్వాత బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది.
ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు?
బీహార్ ఎగ్జిట్ పోల్ LIVE: బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ 2025 ఫలితాలు మరికొద్ది సేపట్లో రానున్నాయి. బీహార్ ఎగ్జిట్ పోల్ లో బీహార్ లో నితీశ్ కుమార్ లేదా తేజస్వి యాదవ్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఎన్డీయే లేదా మహాకూటమి ఎన్ని సీట్లు వస్తాయని, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ ఎంత చేస్తారో అంచనా వేయనున్నారు.
సాయంత్రం 6.30 గంటలకు బిహార్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు
ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బిహార్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ విడుదల కానున్నాయి. ఎన్డీయే, మహా ఘట్‌బంధన్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి.








