ఈ ఏడాది భోగి నాడే షట్తిల ఏకాదశి.. పద్నాలుగేళ్ళ వరకు ఈ అరుదైన యోగం రాదు.. పాటించాల్సినవి ఇవే!
భోగి (Bhogi 2026) అంటే వెలుగుల పండుగకు మొదటి అడుగు. భోగి మంటల్లో దుఃఖాలు అన్నీ కాలిపోయి, సంతోషాలు చిగురించాలని అందరూ కోరుకుంటారు. ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. 2026 భోగి అనేది కేవలం పండుగ కాదు. పంచాంగం పరంగా చూసినట్లయితే అరుదైన ఏకాదశి యోగం ఆ రోజు రావడం విశేషం.
సంక్రాంతి పనులు మొదలైపోయాయి. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. ఈ జనవరి 14 అంటే రేపు భోగి పండుగను జరుపుకోబోతున్నాము. అలాగే 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను జరుపుకోబోతున్నాము. అయితే ఈ సంవత్సరం వచ్చే భోగి పండుగ చాలా విశేషమైనది. భోగి నాడు అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం చోటు చేసుకోనుంది.
ఈ ఏడాది భోగి నాడే షట్తిల ఏకాదశి.. పద్నాలుగేళ్ళ వరకు ఈ అరుదైన యోగం రాదు (pinterest)
వెలుగుల పండుగ భోగి
భోగి (Bhogi 2026) అంటే వెలుగుల పండుగకు మొదటి అడుగు. భోగి మంటల్లో దుఃఖాలు అన్నీ కాలిపోయి, సంతోషాలు చిగురించాలని అందరూ కోరుకుంటారు. ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. 2026 భోగి అనేది కేవలం పండుగ కాదు. పంచాంగం పరంగా చూసినట్లయితే అరుదైన ఏకాదశి యోగం ఆ రోజు రావడం విశేషం.
ఈ భోగికి ఏకాదశి తిథి రావడంతో దీని విశిష్టత మరింత పెరిగింది. భోగి తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతల పగలు ప్రారంభమయ్యే శుభకాలం ఇది. చీకటి నుంచి వెలుగులోకి, బాధల నుంచి ఆశల వైపుకు సాగాలని భోగి పండుగ మనకు సూచిస్తుంది.
భోగి 2026+ షట్తిల ఏకాదశి
పుష్య శుక్ల ఏకాదశి భోగి నాడు రావడం విశేషం. దీనిని షట్తిల ఏకాదశి అని అంటారు. జనవరి 13 మధ్యాహ్నం 3:18కి ఏకాదశి ప్రారంభమవుతుంది. జనవరి 14 సాయంత్రం 5:53తో ముగుస్తుంది. భోగి పండుగ నాడు ఈ ఏకాదశి రావడం భోగి మాత్రమే కాదు, మహా విశేషమైన రోజు కూడా.
షట్తిల ఏకాదశి నాడు వీటిని పాటిస్తే మంచిది
షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
నువ్వుల నూనె ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి.
నల్ల నువ్వులను స్నానం చేసే నీళ్లలో వేసుకొని స్నానం చేయడం మంచిది.
అలాగే నువ్వులను ఏదో ఒక రూపంలో సేవిస్తే కూడా మంచి జరుగుతుంది.
నువ్వులను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది.
విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మానసిక ప్రశాంతతను పొందడానికి వీలవుతుంది.
భోగి మంటలు, శాస్త్రీయ కోణం
భోగి మంటల్లో ఆవు పిడకలు వేసి కాలుస్తారు. దీంతో గాలిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. అలాగే ఔషధ గుణాలు ఉన్న చెట్ల బెరళ్లను కూడా వేస్తే 72 వేల నాడులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ షట్తిల ఏకాదశి భోగి నాడు రావడం చాలా అరుదైన యోగం. మళ్లీ 2040 వరకు ఇది రాదు.