మీకూ డింపుల్స్ ఉన్నాయా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
మనిషి ప్రవర్తించే తీరు, రాసే విధానం, నడిచే విధానం, నిలబడే విధానం తో పాటు వారు ఇష్టపడే రంగులు మొదలైన వాటి ద్వారా కూడా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయన్నది చెప్పవచ్చు. బుగ్గలపై సొట్ట పడినట్లైతే వారు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు తీరు ఎలా ఉంది అనేది చెప్పవచ్చు. అలాగే న్యూమరాలజీఆధారంగా కూడా ఒక వ్యక్తి ఎలా ఉంటారనేది చెప్పవచ్చు. దానితో పాటు మనిషి ప్రవర్తించే తీరు, రాసే విధానం, నడిచే విధానం, నిలబడే విధానం తో పాటు వారు ఇష్టపడే రంగులు మొదలైన వాటి ద్వారా కూడా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయన్నది చెప్పవచ్చు.

ఈరోజు సొట్ట బుగ్గలు ఉన్న వారి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయి? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విషయాలను తెలుసుకుందాం. బుగ్గలపై సొట్ట పడినట్లయితే వారు చాలా అందంగా ఉంటారు. వారు నవ్వినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇతరులు కూడా సులభంగావారికి ఆకర్షితులు అవుతారు. అయితే, బుగ్గలపై సొట్ట పడినట్లైతే వారు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బుగ్గలపై పెద్దగా సొట్ట పడే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
సొట్ట బుగ్గలు ఉన్నవారు తరచుగా ఇతరులను ఆకర్షిస్తారు. వారి మాటలతో ఇతరులను సులభంగా మెప్పిస్తారు. వారు చెప్పిన విషయానికి ఇతరులు ఒప్పుకుని తీరాల్సి వస్తుంది. వారు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు.
స్నేహితులతో సరదాగాసమయం గడుపుతారు. దయ, సానుభూతి ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నా ఆ పరిసరాలను అందంగా మార్చగలరు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండి, పరిస్థితులను సులభంగా చక్కబెట్టగలరు. వారి నవ్వుతో ఇతరులను కూడా నవ్విస్తారు. వారిని చూసినవారికి సంతోషం కలుగుతుంది.
బుగ్గల పైభాగంలో సొట్ట పడితే..
కొంతమందికి బుగ్గల పైభాగంలో సొట్టు పడుతూ ఉంటుంది. అలాంటి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఇతరులకు స్ఫూర్తి నింపగలరు. వారు ఎక్కువగా సైలెంట్‌గా, శాంతంగా ఉంటారు. భావోద్వేగాలను చిరునవ్వుతోనే వ్యక్తపరుస్తారు. ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటారు.
వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కోపంవచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోగలరు. ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. ఎదుటివారి మాటలు శ్రద్ధగా వింటారు. అవసరమైన వారిని సహాయం చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













