AP Transco AEE Exam Schedule : ఏపీలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సాయిసూర్య ప్రవీణ్‌చంద్ వెల్లడించారు.

మొత్తం 629 పోస్టుల కోసం దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ప్రతిభ (మెరిట్), రిజర్వేషన్ నిబంధనలు, వారి ప్రాధాన్యతల (ఆప్షన్లు) ప్రాతిపదికన మాత్రమే ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనుంది. తొలి సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మలి సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పరిధిలో 81 పరీక్షా కేంద్రాలను, పొరుగు రాష్ట్రాల్లో 13 కేంద్రాలను కలిపి మొత్తం 94 కేంద్రాలను సిద్ధం చేశారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక చెల్లుబాటయ్యే అసలు గుర్తింపు కార్డును (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు) తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు ఆదేశించారు.
పరీక్ష ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు, మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా నిరోధించడానికి విద్యుత్ సంస్థలు అపూర్వ భద్రతా చర్యలు చేపట్టాయి. బయోమెట్రిక్ ధ్రువీకరణ, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సమన్వయంతో ప్రతి పరీక్షా కేంద్రంలో మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలు లేదా సమాధానాల సమాచారం ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా ఈ జామర్లు పనిచేస్తాయి.
ప్రిలిమినరీ కీ ఎప్పుడంటే..?
చివరి పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాతి ఏడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 సెప్టెంబరు చివరి వారంలో ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
{{/usCountry}}చివరి పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాతి ఏడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 సెప్టెంబరు చివరి వారంలో ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
{{/usCountry}}ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తుదారులు… https://apvidyutrecruitment.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలతో హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
సంస్థల వారీ ఖాళీలు :
- ఏపీ ట్రాన్స్‌కో - 200 పోస్టులు
- ఏపీ జెన్‌కో - 100 పోస్టులు
- ఏపీఈపీడీసీఎల్ - 135 పోస్టులు
- ఏపీఎస్‌పీడీసీఎల్ - 135 పోస్టులు
- ఏపీసీపీడీసీఎల్ - 60 పోస్టులు