Photos
Breast cancer : రొమ్ము క్యాన్సర్ తగ్గాక తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వొచ్చా?
ఇక గతంలో తనకు వచ్చిన క్యాన్సర్ ప్రభావం పాల ద్వారా బిడ్డకు సోకుతుందేమోనన్న అనుమానం కొందరిలో ఉంటుంది. గతంలో వచ్చిన క్యాన్సర్ కణాలు పాల ద్వారా బిడ్డకు వ్యాపించవని వైద్యులు స్పష్టం చేశారు. అయితే తల్లి ప్రస్తుతం వాడే కొన్ని రకాల తీవ్రమైన మందులు పాలల్లో కలిసే అవకాశం ఉంది. తల్లి ఎలాంటి ప్రమాదకరమైన మందులు వాడటం లేదని నిర్ధారించుకున్న తర్వాతే పాలు ఇవ్వడానికి ఆంకాలజిస్టులు సమ్మతిస్తారు.
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ... ఈ పుణ్యక్షేత్రాలను చూడొచ్చు! పూర్తి వివరాలు
మూడో రోజు (గురువారం) ఉదయాన్నే గోకర్ణకు బయలుదేరి అక్కడ మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ ఆలయాన్ని, కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనాల తర్వాత తిరిగి ఉడుపి చేరుకుని రాత్రి బస చేస్తారు.
నాలుగో రోజు (శుక్రవారం) ఉడుపి హోటల్ చెకౌట్ చేసి హొరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాక శృంగేరికి చేరుకుని శ్రీ శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
తల్లికి వందనం స్కీమ్ పై కీలక అప్డేట్ - కొత్త జాబితా సిద్ధం..! ఈసారి ఎంతమందికంటే
అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన అనంతరం…. విద్యాశాఖ అధికారులు రెండో విడత కింద కొత్తగా 3,29,201 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా ఖరారు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
CJP protest : అడుగడుగునా బ్యారికేడ్లు, క్షణక్షణం తనిఖీలు.. దిల్లీలో ఉద్రిక్తత!
సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలా వాహనంలో పెట్టారు. జంతర్ మంతర్ వద్ద ఎవరు కనిపించినా పోలీసులు వెంటనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Smart Ration Card : స్మార్ట్ రేషన్ కార్డు అందలేదా? ఈ వివరాల ఆధారంగా తీసుకోవచ్చు
స్మార్ట్ రేషన్ కార్డు అందని వారు ఆందోళన చెందకుండా…మీ కార్డులోని వివరాల ఆధారంగా సంబంధిత రేషన్ షాపు వద్దకు వెళ్లి కార్డును పొందొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి - నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులను ప్రకటించింది. అయితే అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు రెండు రోజులు ముందే సెలవులు లభించాయి. దీంతో శనివారం (అక్టోబర్ 10) నుంచే బడులకు సెలవులు అమల్లోకి వచ్చాయి. దసరా విరామం తర్వాత అక్టోబర్ 22వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఈనెల 13 బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీకి భారీ వర్ష సూచన, అంచనాలు ఇలా
ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
Amazon sale : స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్, వాషింగ్ మెషిన్లపై భారీ డిస్కౌంట్లు..
గృహోపకరణాల విభాగంలో ఫ్రంట్-లోడ్, స్మార్ట్ వాషింగ్ మెషీన్లపై ఏకంగా 65 శాతం వరకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పనిచేసే 'శాంసంగ్ 8kg 5 స్టార్ మోడల్' (రూ.20,990), జర్మన్ ఇంజనీరింగ్‌తో వచ్చిన 'బాష్ 12kg యూనిట్', అత్యంత ప్రాక్టికల్‌గా ఉండే 'ఎల్‌జీ 2-ఇన్-1 వాషర్-డ్రైయర్' (రూ.51,499) మోడళ్లు అత్యంత చౌకైన ధరలకే కస్టమర్లకు దక్కుతున్నాయి.
TG LAWCET స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - కాలేజీల వారీగా సీట్ల భర్తీ, వివరాలు
అక్టోబర్ 12వ తేదీతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అయితే కాలేజీల వారీగా తేదీలను నిర్దేశించారు. కొన్ని కాలేజీలకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి.
Amazon Great Indian Festival Sale : అమెజాన్‌లో ఈ గ్యాడ్జెట్స్‌పై అదిరే ఆఫర్లు..
యాపిల్ మ్యాక్‌బుక్ నియో వాస్తవ ధర రూ. రూ. 79,900. కానీ అమెజాన్ సేల్‌లో ఇది రూ. 71,900కే లభిస్తుంది. ఇక డెల్ 15 వాస్తవ ధర రూ. 99,478తో పోల్చితే సేల్‌లో రూ. 73,990కి వస్తోంది. మరోవైపు హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్.. ఆఫర్లు, డిస్కౌంట్ల అనంతరం రూ. 71,300కి లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 90,035
మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా అద్వానీ.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెండో సారి తల్లి అయినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
Harmanpreet Kaur : టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అమేజింగ్ స్టాట్స్..
ఇప్పటివరకు 8 టెస్టులు, 164 వన్డేలు, 210 టీ20లు ఆడారు హర్మన్‌ప్రీత్. వన్డేల్లో 4541, టీ20ల్లో 188 రన్స్ చేశారు. బౌలర్‌గా వన్డేల్లో 31, టీ20ల్లో 32 వికెట్లు తీశారు.
Protein rich foods : శాకాహారంలో లభించే 5 హై ప్రొటీన్ ఫుడ్స్ ఇవే..
రాజ్మా (కిడ్నీ బీన్స్): ఉత్తరాదినే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన రాజ్మాలో ప్రొటీన్లతో పాటు ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఎండిన రాజ్మా గింజల్లో దాదాపు 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.
ఫారిన్ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వీసా రిజెక్ట్!
సొంత దేశం దాటి విదేశాలకు ప్రయాణించడం ఎవరికైనా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే అనుభవం. అయితే, అంతర్జాతీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన, కష్టమైన ఘట్టం వీసా సాధించడం. చాలామంది ప్రయాణికులు ఎంతో ఆశతో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్లు, సరైన సమాచారం లేకపోవడం వల్ల అధికారుల నుంచి తిరస్కరణ ఎదురై తీవ్ర నిరాశకు గురవుతుంటారు. వివిధ దేశాలకు వేర్వేరు వీసా నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. విదేశాంగ యంత్రాంగాలు దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఏమాత్రం తేడా ఉన్నా తిరస్కరిస్తాయి. మొదటిసారి వీసా అప్లై చేసేవారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) ప్రెసిడెంట్ రవి గోసాయ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు - ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, భారీ చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు పిడుగులు పడే సూచనలు కనిపించగానే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని హెచ్చరించారు.
నాన్న రిక్వెస్ట్ చేస్తేనే చేశా-యాక్టింగ్ కెరీర్ పై శ్రుతి హాసన్-లేటెస్ట్ ఫొటోలు!
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ (అక్టోబర్ 3) పోస్టు చేసింది.
ప్రణవి ఆల్-టైమ్ రికార్డు.. భారతదేశానికి తొలి గోల్ఫ్ స్వర్ణం, సిల్వర్ కూడా!
ఆసియా గేమ్స్ చరిత్రలో భారత మహిళల గోల్ఫ్ విభాగం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మైసూర్ క్రీడాకారిణి, 23 ఏళ్ల ప్రణవి ఉర్స్ అత్యంత అద్భుత ప్రదర్శనతో భారత్‌కు ఆసియా గేమ్స్‌లో తొలిసారిగా గోల్ఫ్ వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించి దేశ గర్వకారణంగా నిలిచారు. చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా, మహిళల టీమ్ విభాగంలోనూ భారత్ రజత పతకాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
ఓటీటీలోని సినిమాలో అమ్మవారిగా.. ఇన్‌స్టాలో గ్లామర్ షో.. ఐశ్వర్య రాజేష్ ఫొటోలు!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను చూశారా? ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మహేష్ సినిమాతో డెబ్యూ.. ఆర్జీవీ హీరోయిన్..పోజులతో రచ్చ.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ భామ.. గత రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మరి ఈమె ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
Heart attack : గుండెపోటు ఎలా వస్తుంది? అసలు కారణాలు ఇవి..
ఈ రక్తనాళాల అమరికలో ఒక అద్భుతమైన సహజ వ్యవస్థ ఉందని డాక్టర్ తెలిపారు. గుండె ముందు వైపు, వెనుక వైపు ఉండే రక్తనాళాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ‘సిస్టర్ ఆర్టరీస్’ అని పిలుస్తారు. ఒకవేళ వీటిలో ఒక రక్తనాళంలో అడ్డంకి (బ్లాకేజ్) నెమ్మదిగా ఏర్పడితే, రెండో రక్తనాళం ఆ భాగానికి రక్తాన్ని అందించేందుకు సహాయపడుతుంది. ఇది గుండెకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప రక్షణ కవచం.
వైట్ డ్రెస్ లో గ్లామర్ షో.. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే చేస్తున్న సినిమాలివే!
వైట్ డ్రెస్ లో భాగ్యశ్రీ బోర్సే ఎలా మెరిసిపోతుందో చూశారా? ఆమె ఈ గ్లామర్ పిక్స్ ను ఇవాళ (సెప్టెంబర్ 29) ఇన్ స్టాలో పోస్టు చేసింది.
తెలంగాణలో పెరిగిన ఎండ తీవ్రత - అక్టోబర్ 2 నుంచి తేలికపాటి వర్షాలు
తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
కింగ్ వచ్చాడు- రికార్డు కొట్టాడు- కోహ్లి 15 వేల రన్స్- ప్రపంచంలోనే ఫాస్టెస్ట్!
కింగ్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ గ్యాప్ తర్వాత మైదానంలోకి వచ్చినా బ్యాటింగ్ తో ఇరగదీశాడు.
మరోసారి రెచ్చిపోయిన సీరియల్ నటి.. జగతి మేడం హాట్ షో.. సోషల్ మీడియా షేక్!
జ్యోతి పూర్వాజ్ మరోసారి తన హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Banks : ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్- కారణం ఇదే..
డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) సాధారణ సెలవులు కావడంతో పాటు, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు సమ్మె జరగనుంది. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడితే నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, సాధారణ లావాదేవీలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Paradise Nani : థియేటర్లలో ‘జడల్ జమానా’- ఈ ఓటీటీల్లో నాని టాప్ 5 సినిమాలు..
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్‌కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్‌కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్బాస్టర్ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే
మానసిక ఒత్తిడికి చెక్.. భావోద్వేగాలను అదుపు చేసే 6 సూత్రాలివే!
జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే భావోద్వేగాలు లేదా చేదు అనుభవాలు మనుషుల మనసులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఆ సంఘటన ముగిసిపోయినప్పటికీ పాత సంభాషణలను పదేపదే తలచుకోవడం, భవిష్యత్తు గురించి మితిమీరిన ఆందోళన చెందడం, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా ప్రతిస్పందించడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అయితే, మనసులోకి వచ్చే ప్రతి భావానికి తక్షణమే స్పందించి గందరగోళానికి గురికాకుండా, కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తే మనశ్శాంతిని సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎమోషన్స్‌ని నియంత్రించుకోవడం అంటే అసలు కోపం, బాధ, భయం, ఆందోళన వంటివి కలగకుండా చూసుకోవడం కాదు. ఆ భావాలను గుర్తించి, వాటి ఆధారంగా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అదుపులో ఉంచుకోవడమే అసలైన మనో నిగ్రహం. అశాంతి నుంచి మానసిక స్పష్టత వైపు పయనించడానికి తోడ్పడే 6 సులువైన అలవాట్లు ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!హైదరాబాద్‌లో ఇలా…
మరోవైపు హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. మంగళవారం ఖైరతాబాద్‌లో 3.2 సెం.మీ., కూకట్‌పల్లి 2.8, ముషీరాబాద్ 2.5, అబ్దుల్లాపూర్‌మెట్ 2.3 సెం.మీ. వర్షం కురిసింది.