...
...
Next Story

GATE 2027 : ఐఐటీ గేట్​ అభ్యర్థులకు అలర్ట్​- పరీక్షల తేదీలు, సిలబస్​లో మార్పులు..

గేట్​ 2027కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. గేట్ 2026 పరీక్షల తేదీలు, సిలబస్​ని ఐఐటీ మద్రాస్ సవరిస్తూ.. కొత్త అప్డేట్​ని విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jul 28, 2026, 12:45:12 IST
Advertisement
<p>ఐఐటీ మద్రాస్ ‘గేట్ 2027’ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొత్త సిలబస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈసారి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనిచ్చేలా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ అనే సరికొత్త పేపర్‌ను కూడా చేర్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in లో చూడవచ్చు.</p>

ఐఐటీ మద్రాస్ ‘గేట్ 2027’ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొత్త సిలబస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈసారి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనిచ్చేలా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ అనే సరికొత్త పేపర్‌ను కూడా చేర్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in లో చూడవచ్చు.

నూతన షెడ్యూల్ ప్రకారం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2027) పరీక్షలను 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ఆరు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టులలో ఈ పరీక్ష నిర్వహించనుండగా, అభ్యర్థులు ఒకటి లేదా గరిష్టంగా రెండు సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు ఉంది.

ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' పేపర్‌ను రెండు భాగాలుగా విభజించారు — పార్ట్ ఏ, పార్ట్ బీ. పార్ట్​ ఏలో అందరికీ కామన్ సెక్షన్ ఉంటుంది. పార్ట్​ బీలో రెండు విభాగాలుగా ఉంటుంది — ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మరియు మెకానికల్ ఇంజినీరింగ్. అభ్యర్థులు తమ ప్రాధాన్యతను బట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు,

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఆగస్టు 14 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఒక్క దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రెండు సబ్జెక్టులు రాయాలనుకునేవారు అదే అప్లికేషన్‌లో రెండో పేపర్‌ను జోడించుకోవాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి బహుళ దరఖాస్తులు చేస్తే, ఒక్కటి మాత్రమే ఆమోదించి మిగిలిన వాటిని తిరస్కరిస్తారు. ఆ ఫీజును కూడా వెనక్కి ఇవ్వరని గుర్తుంచుకోవాలి.

గేట్ 2027 ఫీజు- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు రూ. 1000. ఇతర అభ్యర్థులకు రూ. 2000. ఆలస్య రుసుముతో.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 1500, ఇతరులకు రూ. 2500గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపులు అన్నీ ఆన్​లైన్​లోనే చేయాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe