...
...
Next Story

శ్రీశైలం భక్తులకు అలర్ట్ - వీఐపీ దర్శనాలు, సిఫార్సు లేఖలపై కొత్త నిబంధనలు!

Srisailam Temple VIP Darshan Rules : శ్రీశైల క్షేత్రంలో వీఐపీ దర్శనాలు, వసతి కోసం సిఫార్సు లేఖలను రెండు రోజుల ముందే పంపాలని అధికారులు నిర్ణయించారు. వారాంతాల్లో స్పర్శదర్శనం వేళల్లో పలు మార్పులు చేశారు.

Published on: Aug 3, 2026, 09:27:03 IST
Advertisement
<p>ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం వచ్చే ప్రముఖులకు దేవస్థానం పాలకమండలి కీలక సూచనలు చేసింది. స్వామివారి దర్శనం, వసతి గదుల కోసం తీసుకువచ్చే సిఫార్సు లేఖలను కనీసం రెండు రోజుల ముందే ఆలయ అధికారులకు అందజేయాలని నిర్ణయించింది.</p><p> </p>

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం వచ్చే ప్రముఖులకు దేవస్థానం పాలకమండలి కీలక సూచనలు చేసింది. స్వామివారి దర్శనం, వసతి గదుల కోసం తీసుకువచ్చే సిఫార్సు లేఖలను కనీసం రెండు రోజుల ముందే ఆలయ అధికారులకు అందజేయాలని నిర్ణయించింది.

సిఫార్సు లేఖలతో వచ్చే ప్రముఖులకు స్పర్శదర్శనం వేళల్లో దేవస్థానం పలు మార్పులు చేసింది. తాజా నిర్ణయాల ప్రకారం… శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సిఫార్సు లేఖలు ఉన్నవారికి స్పర్శదర్శన అనుమతి ఉండదు. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తారు.

మంగళవారం నుంచి గురువారం వరకు రోజుల్లో సాధారణ రోజుల్లాగే ప్రతిరోజూ మూడు విడతల్లో యథావిధిగా స్పర్శదర్శనం కల్పిస్తారు.పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పరిమితంగా స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తారు.

విఐపిలు, ప్రముఖులు తమ సిఫార్సు లేఖలను దర్శన సమయానికి 2 రోజుల ముందే డిజిటల్ రూపంలో ఆలయ ప్రోటోకాల్ విభాగానికి పంపాల్సి ఉంటుంది. protocol@srisailadevasthanam.org, లేదా వాట్సాప్ నంబర్ కు 91600 16215 పంపాలని అధికారులు సూచించారు.

ముందస్తుగా అందని లేఖలను లేదా దర్శనం రోజున నేరుగా ఇచ్చే లేఖలను పరిశీలించడం కుదరదని, భక్తులు ఈ మార్పులను గమనించి ఆలయ యంత్రాంగానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe