...
...
Next Story

చిప్స్ ప్యాకెట్‌లో సగానికి పైగా గాలే ఎందుకు ఉంటుంది? పెద్ద సైన్సె ఇది!

చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే సగం గాలే ఉండి, కొన్ని చిప్స్ మాత్రమే కనిపించడం మనందరికీ అనుభవమే. కానీ ఆ గాలి మనల్ని మోసం చేయడానికి కాదని, చిప్స్‌ను తాజాగా, క్రిస్పీగా ఉంచడానికేనని మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇక్కడ చదవండి.

Published on: Jul 31, 2026, 11:21:06 IST
Advertisement
<p>మనం తినే చిప్స్ ప్యాకెట్ చూస్తేనేమో నిండుగా కనిపిస్తుంది, కట్ చేస్తే మాత్రం సగానికి పైగా ఖాళీ ఉంటుంది. మనల్ని మోసం చేసి, ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు భ్రమ కల్పించడానికే కంపెనీలు ఇలా పెద్ద ప్యాకెట్లు వాడుతున్నాయని చాలామంది భావిస్తుంటారు. రవాణా, ప్రదర్శన కోసం ప్యాకేజింగ్ కొంతవరకు తోడ్పడినప్పటికీ, ప్యాకెట్‌లో ఉండే ఆ గాలి వెనుక ఒక కీలకమైన కారణం ఉంది. నిజానికి ఆ గాలే లేకపోతే.. మీకు ఇష్టమైన చిప్స్ కరకరలాడుతూ కాకుండా, పిండి పిండిగా మీ చేతికి అందుతాయి. ఇంతకీ చిప్స్ ప్యాకెట్‌లో అంత గాలి ఎందుకు ఉంటుంది? దానికి గల శాస్త్రీయ కారణాలేంటో వివరంగా తెలుసుకుందాము.</p>

మనం తినే చిప్స్ ప్యాకెట్ చూస్తేనేమో నిండుగా కనిపిస్తుంది, కట్ చేస్తే మాత్రం సగానికి పైగా ఖాళీ ఉంటుంది. మనల్ని మోసం చేసి, ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు భ్రమ కల్పించడానికే కంపెనీలు ఇలా పెద్ద ప్యాకెట్లు వాడుతున్నాయని చాలామంది భావిస్తుంటారు. రవాణా, ప్రదర్శన కోసం ప్యాకేజింగ్ కొంతవరకు తోడ్పడినప్పటికీ, ప్యాకెట్‌లో ఉండే ఆ గాలి వెనుక ఒక కీలకమైన కారణం ఉంది. నిజానికి ఆ గాలే లేకపోతే.. మీకు ఇష్టమైన చిప్స్ కరకరలాడుతూ కాకుండా, పిండి పిండిగా మీ చేతికి అందుతాయి. ఇంతకీ చిప్స్ ప్యాకెట్‌లో అంత గాలి ఎందుకు ఉంటుంది? దానికి గల శాస్త్రీయ కారణాలేంటో వివరంగా తెలుసుకుందాము.

చిప్స్ ప్యాకెట్లలో నింపేది మనం పీల్చే సాధారణ గాలి కాదు. తయారీదారులు ప్యాకెట్‌ను సీల్ చేయడానికి ముందు అందులో ప్రత్యేకంగా 'నైట్రోజన్' వాయువును నింపుతారు. మనం పీల్చే గాలిలో దాదాపు 78 శాతం ఉండే నైట్రోజన్‌కు రంగు, వాసన ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా ఇదొక తటస్థ (Inert) వాయువు. అంటే ఇది ఆహార పదార్థాలతో అంత తేలిగ్గా రసాయనిక చర్య జరపదు. సాధారణ గాలిలో ఉండే ఆక్సిజన్ వల్ల చిప్స్‌లోని నూనెలు త్వరగా పాడైపోయి, దుర్వాసన రావడం మొదలవుతుంది. ఆక్సిజన్‌ను తొలగించి దాని స్థానంలో నైట్రోజన్‌ను నింపడం వల్ల చిప్స్ చాలా కాలం పాటు పాడవకుండా, కరకరలాడుతూ, మంచి రుచితో తాజాగా ఉంటాయి.

ప్యాకెట్‌లో ఖాళీగా కనిపించే ఆ స్పేస్ మరో ముఖ్యమైన పనిని కూడా చేస్తుంది! చిప్స్ చాలా సున్నితంగా ఉండి, చిన్న ఒత్తిడికే విరిగిపోయే ప్రమాదం ఉంది. ఫ్యాక్టరీలో తయారైనప్పటి నుంచి గొదాములు, డెలివరీ ట్రక్కులు, సూపర్‌మార్కెట్ షెల్ఫ్‌ల వరకు ఎన్నో చేతులు మారిన తర్వాతే ప్యాకెట్ మన చేతికి చేరుతుంది. ఈ ప్రయాణంలో ప్యాకెట్‌లోని నైట్రోజన్ ఒక 'కుషన్' (దిండు) లాగా పనిచేసి, బయటి నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటుంది. దీనివల్ల లోపల ఉన్న చిప్స్ నలిగిపోకుండా సురక్షితంగా ఉంటాయి. ఒకవేళ ఎలాంటి గాలి లేకుండా ప్యాకెట్‌ను గట్టిగా ప్యాక్ చేస్తే, అది మన దగ్గరకు వచ్చేసరికి చిప్స్‌లా కాకుండా ముక్కల పొడిలా మారుతుంది.

మరి చిన్న ప్యాకెట్లు వాడొచ్చు కదా? అని డౌట్ వస్తుంది. దీనికి సమాధానం అనుకున్నంత సులభం కాదు. ఉత్పత్తికి రక్షణ కల్పించడం, తయారీ యంత్రాలకు అనుకూలంగా ఉండటం, రవాణాను సులభతరం చేయడం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజింగ్‌ను డిజైన్ చేస్తారు. వేర్వేరు రకాల చిప్స్ వేర్వేరు పరిమాణాలు, ఆకారాల్లో ఉంటాయి కాబట్టి వాటికి కావాల్సిన ఖాళీ స్పేస్ కూడా మారుతుంటుంది. మరో ముఖ్యమైన విషం ఏంటంటే.. కంపెనీలు ప్యాకెట్ నిండుగా ఉంతుందని లేబుల్‌పై ఎప్పుడూ చెప్పవు. అందులో ఉన్న ఉత్పత్తుల నెట్ వెయిట్ మాత్రమే స్పష్టంగా పేర్కొంటాయి. ప్యాకెట్ పెద్దగా ఉందా లేదా చిన్నగా ఉందా అనేదానితో సంబంధం లేకుండా, అందులోని చిప్స్ పరిమాణాన్ని గ్రాముల బరువు ఆధారంగానే కొలుస్తారు.

కంపెనీలు మనల్ని మోసం చేయడం లేదా? ఖచ్చితంగా లేదు! పెద్ద ప్యాకింగ్ చూడటానికి ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్యాకెట్ లోపల ఉండే వాయువుకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. అది ఆహార తాజాదనాన్ని కాపాడటంతో పాటు, చిప్స్ విరిగిపోకుండా చూస్తుంది. అలాగే ఉత్పత్తి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా సహాయపడుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe