...
...
Next Story

Weight loss : రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇదీ అసలు నిజం..

రాత్రివేళ అన్నం తింటే బరువు పెరుగుతారనేది నిజమేనా? డైట్‌లో ఉన్నవారు రాత్రి పూట రైస్ పూర్తిగా మానేయాలా? ఈ విషయంపై ఉన్న అపోహలను తొలగిస్తూ, నిపుణులు చెబుతున్న కీలక విషయాలు ఇవే..

Published on: Aug 1, 2026, 11:20:27 IST
Advertisement
<p>బరువు తగ్గాలని అనుకోగానే చాలామంది మనసులో మొదటిగా మెదిలే ఆలోచన.. 'అన్నం (రైస్) తినడం మానేయాలి' అని. కాలక్రమేణా కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి మంచివని, మరికొన్ని బరువు పెంచుతాయని ప్రచారం జరగడంతో.. ఈ వివాదంలో అన్నం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. అందుకే చాలామంది రాత్రి వేళల్లో అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు. మరికొందరు అన్నానికి ప్రత్యామ్నాయంగా రొట్టెలు లేదా ఇతర ఆహారాలను ఎంచుకుంటారు. అయితే నెట్టింట, సోషల్ మీడియాలో దొరికే వేలాది డయట్ చిట్కాల మధ్య అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం కాస్త కష్టమే. ఈ గందరగోళానికి తెరదించుతూ.. రాత్రివేళల్లో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా అనే అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్టులు) ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..</p>

బరువు తగ్గాలని అనుకోగానే చాలామంది మనసులో మొదటిగా మెదిలే ఆలోచన.. 'అన్నం (రైస్) తినడం మానేయాలి' అని. కాలక్రమేణా కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి మంచివని, మరికొన్ని బరువు పెంచుతాయని ప్రచారం జరగడంతో.. ఈ వివాదంలో అన్నం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. అందుకే చాలామంది రాత్రి వేళల్లో అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు. మరికొందరు అన్నానికి ప్రత్యామ్నాయంగా రొట్టెలు లేదా ఇతర ఆహారాలను ఎంచుకుంటారు. అయితే నెట్టింట, సోషల్ మీడియాలో దొరికే వేలాది డయట్ చిట్కాల మధ్య అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం కాస్త కష్టమే. ఈ గందరగోళానికి తెరదించుతూ.. రాత్రివేళల్లో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా అనే అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్టులు) ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

న్యూట్రిషనిస్ట్​ల ప్రకారం.. కేవలం రాత్రి పూట అన్నం తినడం వల్ల మాత్రమే ఎవరూ బరువు పెరగరు! మన బరువు పెరగడం లేదా తగ్గడం అనేది రోజంతా మనం తీసుకునే మొత్తం క్యాలరీలు, మనం కరిగించే క్యాలరీలపై ఆధారపడి ఉంటుంది తప్ప, ఒక్క పూట తినే ఆహారం సమయంపై కాదు. మీరు రోజంతా ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నంత కాలం, రాత్రి డిన్నర్‌లో అన్నం తిన్నా బరువు పెరిగే అవకాశమే లేదు. కాబట్టి, 'రాత్రివేళ అన్నం తింటే బరువు పెరుగుతారు,' అనే మాట కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.

రాత్రి భోజనంలో అన్నం తీసుకుంటున్నప్పటికీ, తినే పరిమాణంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక పూటకు వండిన అన్నం అర కప్పు నుంచి ఒక కప్పు పరిమాణానికి మించకుండా చూసుకోవాలి. అలాగే కేవలం పప్పు, అన్నం మాత్రమే కాకుండా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పనీర్, కోడిగుడ్లు లేదా చికెన్‌తో పాటు పీచు పదార్థాలు ఉండే కూరగాయలను కూడా ప్లేట్‌లో భాగం చేసుకోవాలి. ఈ కాంబినేషన్ వల్ల భోజనం సమతుల్యంగా మారడమే కాకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది.

అయితే రాత్రివేళ అన్నం తినేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలి. సింగిల్ పాలిష్ చేసిన బియ్యం లేదా దంపుడు బియ్యం ఎంచుకోవడం మంచిది. రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఎంత రుచిగా ఉన్నప్పటికీ అతిగా తినకూడదు. అంతేకాకుండా, అందరికీ ఒకే రకమైన బియ్యం సరిపోతాయని చెప్పలేము. మన ప్రాంతంలో పండే స్థానిక బియ్యాన్ని ఎంచుకుని, దానిని పప్పు, కూరలతో కలిపి సంపూర్ణ ఆహారంగా తీసుకోవాలి.

చాలామంది బరువు తగ్గడానికి రాత్రివేళ అన్నం మానేసి కేవలం రొట్టెలు (రొటీ) తింటుంటారు. కానీ ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనే ప్రశ్నకు అందరికీ వర్తించే ఒకే సమాధానం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణ వ్యవస్థకు ఏది తేలికగా అనిపిస్తుంది, మీకు ఏది ఇష్టం అనేదానిపై మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది. రొట్టెనా, అన్నమా అని ఆలోచించే కంటే.. మీరు ఎంత పరిమాణంలో తింటున్నారు, ఆ ప్లేట్‌లో సరైన పోషకాలు ఉన్నాయా లేదా అనేదానిపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం.

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాత్రి వేళల్లో అన్నం తినడం వల్ల బరువు తగ్గే ప్రక్రియకు ఎలాంటి ఆటంకమూ కలగదు. మీరు ఎంత పరిమాణంలో తింటున్నారు, దేనితో కలిపి తింటున్నారు, రోజంతా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అనేదే ఇక్కడ అసలైన విషయం. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట ప్లేట్ నుంచి అన్నాన్ని పూర్తిగా పక్కనబెట్టాల్సిన పనిలేదు. సరైన పరిమాణంలో, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe