...
...
Next Story

Weight loss : క్రాష్ డైట్​తో కడుపు మాడ్చుకోకుండా.. ఇవి ఫాలో అయ్యి బరువు తగ్గండి!

బరువు తగ్గాలని అనుకోగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది 'క్రాష్ డైట్'. కడుపు మార్చుకోవడం లేదా కఠినమైన నియమాలు పెట్టుకోవడం చేస్తుంటారు. దీనితో పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే, ఎలాంటి క్రాష్​ డైట్​లు లేకుండా సింపుల్​ టిప్స్​తో బరువు ఎలా తగ్గాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 3, 2026, 12:20:26 IST
Advertisement
<p><strong>ప్లేట్ రూల్ మార్చండి-</strong> బరువు తగ్గడానికి ప్రతీ గ్రాము ఆహారాన్ని కొలవాల్సిన పనిలేదు. మీరు తినే ప్లేట్ నిర్మానాన్ని కొద్దిగా మార్చితే సరిపోతుంది. పళ్లెంలో సగం భాగం కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావనను ఇస్తుంది. 25 శాతం గుడ్లు, పన్నీర్, చికెన్ లేదా పప్పుధాన్యాల వంటి ప్రోటీన్ ఆహారానికి కేటాయించాలి. మిగిలిన పావు భాగం జొన్నలు, రాగులు, ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఈ పద్ధతి వల్ల అతిగా తినే అలవాటు వాటంతట అదే తగ్గుతుంది.</p>

ప్లేట్ రూల్ మార్చండి- బరువు తగ్గడానికి ప్రతీ గ్రాము ఆహారాన్ని కొలవాల్సిన పనిలేదు. మీరు తినే ప్లేట్ నిర్మానాన్ని కొద్దిగా మార్చితే సరిపోతుంది. పళ్లెంలో సగం భాగం కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావనను ఇస్తుంది. 25 శాతం గుడ్లు, పన్నీర్, చికెన్ లేదా పప్పుధాన్యాల వంటి ప్రోటీన్ ఆహారానికి కేటాయించాలి. మిగిలిన పావు భాగం జొన్నలు, రాగులు, ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఈ పద్ధతి వల్ల అతిగా తినే అలవాటు వాటంతట అదే తగ్గుతుంది.

ప్రోటీన్, ఫైబర్- క్యాలరీలు తగ్గించడం కంటే ముందు శరీరానికి సరైన పోషకాలు అందుతున్నాయో లేదో చూడాలి. ఉదయం టిఫిన్‌లో గుడ్లు, పన్నీర్ లేదా టోఫు వంటివి చేరిస్తే మధ్యాహ్నం వరకు అనవసరమైన స్నాక్స్ తినాలనిపించదు. అలాగే మధ్యాహ్న భోజనంలో పప్పు, రాజ్మా, చోలే, చికెన్ లేదా చేపలు ఉండేలా చూసుకుంటే సాయంత్రం వేళ వచ్చే ఆకలి కోరికలు తగ్గుతాయి. రాత్రి వేళ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ తేలికవుతుంది.

ప్రత్యామ్నాయాలు వెతకండి- మీకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వేయించిన జంక్ ఫుడ్ స్థానంలో వేయించిన శనగలు (గుడాలు), మఖానా, వేరుశనగలు తినవచ్చు. టీలో చక్కెర ఒక్కసారిగా బంద్ చేయకుండా కొద్దికొద్దిగా తగ్గించండి. కూల్ డ్రింక్స్ బదులు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరిబోండం లేదా మజ్జిగ తాగడం అలవాటు చేసుకోండి.

ప్లాన్ ఉండాలి- చాలామంది ఆకలి వేసినప్పుడు ఎదురుగా ఏది ఉంటే అది (జంక్ ఫుడ్) తినేస్తుంటారు. దీనికి ప్లానింగ్ లేకపోవడమే కారణం. అలసిపోయిన వేళల్లో కూడా 5 నిమిషాల్లో చేసుకోగలిగే గుడ్డు-రొట్టె, పెరుగు-అటుకులు లేదా పప్పు-కూరగాయలు ఇంట్లో సిద్ధంగా ఉంచుకోండి. ముందుగానే కూరగాయలు కోసి పెట్టుకోవడం వల్ల సమయం ఆదా అయి బయటి ఆహారం వైపు మనసు మల్లకుండా ఉంటుంది.

వీకెండ్ ట్రీట్ ఓకే- డైటింగ్ చేస్తున్నామని జీవితంలో ఆనందాలే లేకుండా చేసుకోవాల్సిన పనిలేదు. వారానికి ఒకరోజు లేదా వీకెండ్‌లో మీకు ఇష్టమైన స్వీట్ లేదా ఆహారాన్ని హాయిగా తినవచ్చు. దీనివల్ల డైట్‌ను సుదీర్ఘకాలం పాటు విసిగులేకుండా కొనసాగించవచ్చు.

ఇలా చేయండి- ఒకేసారి 10 రకాల నియమాలు పెట్టుకుని మధ్యలోనే వదిలేయడం కంటే.. ఏవైనా రెండు మంచి అలవాట్లతో ప్రయాణం మొదలుపెట్టండి. రోజూ ఉదయం ప్రోటీన్ డైట్ తీసుకోవడం- రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగడం. రాత్రి 9:30 కల్లా భోజనం ముగించడం. ఈ చిన్న మార్పులే మిమ్మల్ని ఆరోగ్యకరమైన బరువు వైపు నడిపిస్తాయి. పొరపాటున ఏదైనా రోజు ఎక్కువ తిన్నా ఆత్మనూన్యతా భావానికి గురికాకుండా.. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరుసటి రోజు నుంచి మళ్లీ సరిగ్గా ప్లాన్ చేసుకోండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe