...
...
Next Story

ఏపీని అత్యుత్తమ మారిటైమ్ హబ్‌గా నిలబెట్టేందుకు కార్యాచరణ

హిందుస్థాన్ షిప్ యార్డ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం, వీఎస్ఎం (రిటైర్డ్).. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్ర తీరప్రాంతాన్ని ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంపై విస్తృత చర్చలు జరిపారు.

Updated on: Aug 7, 2026, 06:18:46 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖరన్ రఘురామ్ మధ్య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం చంద్రబాబుతో హెచ్ఎస్ఎల్ సీఎండీ చంద్రశేఖరన్ రఘురాం
సీఎం చంద్రబాబుతో హెచ్ఎస్ఎల్ సీఎండీ చంద్రశేఖరన్ రఘురాం

మచిలీపట్నం, దుగరాజపట్నంలలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డులు హెచ్ఎస్ఎల్ భవిష్యత్ ఎదుగుదలకు అత్యంత కీలకం కానున్నాయి. ఇవి దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భారత్‌ను నౌకా నిర్మాణ రంగంలో స్వయంసమృద్ధి వైపు తీసుకెళ్తాయి.

నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతులు, అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో కలిపి సుమారు 18 లక్షల పనిదినాలకు తగిన ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి సముద్ర రంగంలో ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి.

ఫ్యాబ్రికేషన్, విడిభాగాల తయారీ, అవుట్‌ఫిట్టింగ్, సరఫరా వ్యవస్థలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,000 కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. దీంతో రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలు భారత నౌకా నిర్మాణ సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యం కానున్నాయి.

సమగ్ర సముద్ర పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించనున్నారు. సమగ్ర మార్గదర్శకాలతో కూడిన మారిటైమ్ ఈకోసిస్టమ్ ద్వారా వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించి, భారతదేశంలోనే ఏపీని అత్యుత్తమ మారిటైమ్ హబ్‌గా నిలబెట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ మేరకు హెచ్‌ఎస్‌ఎల్ కార్యాచరణ చేపట్టనున్నట్లు సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వృద్ధితో పాటు దేశ స్వావలంబన లక్ష్యాలకు హెచ్‌ఎస్‌ఎల్ చేపడుతున్న చర్యలు దోహదపడనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe