...
...
Next Story

ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి వేర్వురు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలున్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్‌ 21వ తేదీలోపు అప్లయ్ చేసుకోవచ్చు. https://andhrauniversity.edu.in/ వెబ్ సైట్ లో వివరాలు చూడొచ్చు.

Published on: Nov 12, 2025, 12:07:16 IST
Advertisement

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 6 ఖాళీలను రిక్రూట్ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు….నవంబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు…

ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు
ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు

6 పోస్టుల భర్తీకి గాను వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఒకటి ఉండగా… రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ ఖాళీలు 1, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌ 2 ఉన్నాయి. ఇక రీసెర్చ్ ఫెలో 1 పోస్టు ఉండగా… టైపిస్ట్ పోస్టు 1 ఉంది. అర్హత గల అభ్యర్థులు https://andhrauniversity.edu.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

నోటిఫికేషన్ వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగ ఖాళీలు -06 (టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి)
  • ఈ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు.
  • బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి. పూర్తి వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. టైపిస్ట్ పోస్టకు సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
  • జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700- రూ.1,82,400; రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌కు రూ.44,570- రూ.1,27,480; ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌కు రూ.32,670- రూ.1,01,970; టైపిస్ట్‌కు రూ.37,747.
  • వయోపరిమితి: 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
  • దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
  • దరఖాస్తు ఫీజు ఓబీసీలకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 250
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ - 25 నవంబర్ 2025
  • పూర్తి చేసిన దరఖాస్తుని 'ది రిజిస్ట్రార్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం - 530003' చిరునామాకు పంపించాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://andhrauniversity.edu.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe