ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసనకు యత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక నాయకత్వాన్ని దిల్లీ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని విడుదల చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.
విమానాశ్రయం రన్‌వేపైనే వ్యూహాత్మక అరెస్ట్..

శనివారం ఉదయం 10:18 గంటలకు దిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన 'ఎయిర్ ఇండియా ఏఐ 2428' విమానంలోనే ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ సూచనలతో విమానాన్ని ప్రధాన టెర్మినల్‌కు కాకుండా దూరంగా ఉన్న 'రిమోట్ బే ఆర్12' వద్దకు తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న దిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు విమానం తలుపులు తెరవగానే లోపలికి వెళ్లి అభిజీత్ దీప్కేతో పాటు మిగిలిన నేతలను అదుపులోకి తీసుకెళ్లారు. శనివారం రోజంతా వారి ఆచూకీ తెలియకుండా రహస్య ప్రదేశంలో ఉంచారని సీజేపీ న్యాయ విభాగం ఆరోపించింది.
సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే, కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను దాదాపు 24 గంటల కస్టడీ అనంతరం పోలీసులు ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.
విచారణ జరిపిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రాబోయే ఒక సంవత్సరం కాలం పాటు ఎలాంటి "శాంతిభద్రతల విఘాతానికి" పాల్పడకూడదని, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయకూడదని సీజేపీ నేతలకు కోర్టు స్పష్టమైన షరతు విధించింది.
మేజిస్ట్రేట్ ఉత్తర్వుల అనంతరం విడుదలైన నేతలు ముఖంలో చిరునవ్వుతో కెమెరాలకు చేతులు ఊపుతూ కనిపించారు.
కస్టడీలో ఉన్నప్పుడే నానమ్మ మృతి..
ఒకవైపు అభిజీత్ దీప్కే దిల్లీ పోలీసుల కస్టడీలో ఉండగా, మహారాష్ట్రలోని ఆయన సొంత ఊరిలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. హింగోలీ జిల్లా సంతూక్ పింప్రి గ్రామంలో ఉన్న అభిజీత్ నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) శనివారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారు.
{{/usCountry}}ఒకవైపు అభిజీత్ దీప్కే దిల్లీ పోలీసుల కస్టడీలో ఉండగా, మహారాష్ట్రలోని ఆయన సొంత ఊరిలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. హింగోలీ జిల్లా సంతూక్ పింప్రి గ్రామంలో ఉన్న అభిజీత్ నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) శనివారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారు.
{{/usCountry}}అయితే పోలీసులు అభిజీత్‌ను అజ్ఞాతంలోకి తీసుకెళ్లి, ఫోన్ మాట్లాడేందుకు కూడా అనుమతించకపోవడంతో నానమ్మ మరణవార్త ఆయనకు అందలేదని తొలుత అందరు భావించారు. కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా పోలీసులు దీప్కేను ఆపివేశారని, ఇది అత్యంత అమానుషమైన చర్య అని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు మండిపడ్డాయి.
అయితే నానమ్మ మరణవార్తను దీప్కేకి అందించినట్టు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
దిల్లీవ్యాప్తంగా 7,000 మంది డిటైన్.. ధ్రువ్ రాఠీ విడుదల
శనివారం నాటి సీజేపీ నిరసన పిలుపుతో దేశ రాజధాని దిల్లీ పూర్తిగా స్తంభించిపోయింది. జంతర్ మంతర్ వైపు తరలివస్తున్న దాదాపు 7,000 మంది ఆందోళనకారులను పోలీసులు, పారామిలటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నిరసనకు ముందస్తు అనుమతి లేదనే సాకుతో నగరమంతటా ఆంక్షలు విధించారు.
ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు గురుగ్రామ్ నుంచి బయలుదేరిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా శనివారం రోజంతా కస్టడీలో ఉంచిన పోలీసులు, అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు.
డిటైన్ చేసిన నిరసనకారుల్లో ఎక్కువమందిని శనివారం రాత్రికే వదిలేసినప్పటికీ, సీజేపీ అగ్రనాయకత్వాన్ని మాత్రం ఆదివారం ఉదయం వరకు పోలీసు స్టేషన్లలోనే ఉంచారు.
'ఆగేదే లేదు.. నిరసనలు కొనసాగుతాయి!'
పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులకు భయపడేది లేదని, తమ ఆందోళన నిరంతరం కొనసాగుతుందని సీజేపీ లీగల్ టీమ్ ప్రకటించింది. ప్రతిరోజూ జంతర్ మంతర్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు దిల్లీ పోలీసులు కూడా నగరంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలను కొనసాగిస్తున్నారు.