...
...
Next Story

సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ రేంజ్​- స్టైల్​తో పాటు బెస్ట్​ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​ ఇది..

కొత్తగా ఒక మంచి ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చే రివల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 22, 2025, 05:48:14 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఇండియా ఆటోమొబైల్​ సెగ్మెంట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లే కాదు ఎలక్ట్రిక్​ బైక్​ ఆప్షన్స్​ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవి యువతతో పాటు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈలాంటి వాటిల్లో ఒకటి రివోల్ట్​కి చెందిన ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​! ఈ మోడల్​కి మంచి డిమాండ్​ కూడా కనిపిస్తోంది. స్టైల్​తో పాటు లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. నగరాల్లో ప్రయాణానికి ఈ మోడల్​ సూట్​ అయ్యే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ : బ్యాటరీ- రేంజ్​..

ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​..
ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​..

ఈ రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ 3.24 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంది. దీనిని 0 నుంచి 80శాతం వరకు సాధారణ ఛార్జర్​తో ఛార్జ్​​ చేయడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెప్పింది. కాగా ఫాస్ట్​ ఛార్జింగ్​తో 0 నుంచి 80శాతం ఛార్జ్​ చేసేందుకు కేవలం 1 గంట 20 నిమిషాల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈకో మోడ్​లో 160 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుందని రివోల్ట్​ పేర్కొంది.

రివోల్ట్​ ఆర్​వీ1+ పై 5ఏళ్లు లేదా 75వేల కిలోమీటర్ల వరకు ఎక్స్​టెండెడ్​ ప్రాడక్ట్​ వారెంటీని సంస్థ అందిస్తోంది. అదే సమయంలో బ్యాటరీపై కూడా 5ఏళ్లు లేదా 75వేల కిలోమీటర్ల వరకు ఎక్స్​టెండెడ్​ వారెంటీని ఇస్తోంది. ఛార్జర్​పై 2ఏళ్ల వారంటీ లభిస్తోంది.

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ : స్పెసిఫికేషన్లు..

సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్​ బైక్​లో 4 డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. బ్లాక్​ మిడ్​నైట్​ బ్లూ, బ్లాక్​ నియాన్​ గ్రీన్​, కాస్మిక్​ బ్లాక్​ రెడ్​, టైటాన్​ రెడ్​ సిల్వర్​. ఈ ఈ-బైక్​ గ్రౌండ్​ క్లియరెన్స్​ 180ఎంఎం. ఇది గరిష్ఠంగా 250 కేజీల బరువును మోయగలదు. సీట్​ హైట్​ 790ఎంఎం. వీల్​బేస్​ 1350ఎంఎంగా ఉంది. ఈ బైక్​ కెర్బ్​ వెయిట్​ 110కేజీలు.

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్ బైక్ఎక్స్​షోరూం ధర రూ. 1,04,990 వద్ద ప్రారంభమవుతుంది. ఆన్​లైన్​లో లభించే అధికారిక వెబ్​సైట్​లో ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని బుక్​ చేసుకోవచ్చు. టెస్ట్​ రైడ్​ కూడా బుక్​ చేసుకోవచ్చు. లేదా సమీప డీలర్​షిప్​షోరూమ్​కి వెళ్లి ఈ మోడల్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe