...
...
Next Story

బ్యాంకు కస్టమర్స్​కి అలర్ట్​! జులై నెల సెలవుల జాబితా ఇదే..

జులై నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితా విడుదలైంది. తెలంగాణ, హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో 2025 జులై బ్యాంక్​ హాలీడే లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Jun 27, 2025, 06:51:09 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఇంకొన్ని రోజుల్లో జూన్​ నెలకు ముగింపు పడనుంది. ఇక జులై నెలలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) తాజాగా సెలవుల లిస్ట్​ని విడుదల​ చేసింది. బ్యాంక్​ పనుల మీద తిరిగే వారు ఈ 2025 జులై​ బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జులై 2025​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

జులైలో బ్యాంకు సెలవుల వివరాలు..

జులైలో బ్యాంకు సెలవుల వివరాలు..
జులైలో బ్యాంకు సెలవుల వివరాలు..

జులై 3, గురువారం - ఖర్చి పూజ, అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.

జులై 5, శనివారం- గురు హర్గోబింద్​ జీ జయంతి, జమ్ముకశ్మీర్​లోని బ్యాంకులకు సెలవు

జులై 14, సోమవారం- బెహ్​ దైక్లామ్​, షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 16, బుధవారం- హరేలా, డెహ్రాడూన్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 17, గురువారం- తిరోత్​ సింగ్​ వర్ధంతి, షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 19, శనివారం- కేర్​ పూజా, అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.

జులై 21, సోమవారం- బోనాలు, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జులై 28, సోమవారం- దృక్ప షీ-జీ, గ్యాంగ్టక్​లోని బ్యాంకులకు సెలవు.

వారాంతపు సెలవులు కూడా..

*అన్ని బ్యాంకలకు సెలవు

జులై 6- ఆదివారం.

జులై 12- రెండో శనివారం.

జులై 13- ఆదివారం.

జులై 20- ఆదివారం.

జులై 26- నాలుగో శనివారం.

జులై 27- ఆదివారం.

ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చు..

నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో ఎలాటి సంబంధం లేకుండా ఆన్​లైన్ వెబ్​సైట్లు, మొబైల్ బ్యాంకింగ్సేవలను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంనైనా మీరు సులబంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఏది ఏమైనా 2025 జులై​​ బ్యాంకు​ సెలవుల లిస్ట్​ని చూసి అందుకు తగ్గట్టుగా బ్యాంకు కార్యక్రమాలు ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం!

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe