...
...
Next Story

నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే

తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 607 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

Published on: Jun 28, 2025, 13:09:19 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి భారీ నోటిఫికేషన్జారీ అయింది. మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ ప్రకటన - మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం.
  • ఉద్యోగాల పేరు - అసిస్టెంట్ ప్రొఫెసర్
  • మొత్తం ఖాళీలు - 607 ఉద్యోగాలు (మల్డీ జోన్ 1 లో 379, మల్టీ జోన్ 2లో 228 ఉన్నాయి)
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి.
  • దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. అధికారిక వెబ్ సైట్ లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
  • ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 10వ తేదీతో ప్రారంభమవుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు జూలై 17 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
  • జూలై 18వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
  • ఎంపికైన వారికి నెల జీతం - రూ. 68,900 – రూ. 2,05,500
  • దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి,
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
  • వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 80 పాయింట్లను అకడమిక్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. మరో 20 పాయింట్లను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన వారికి వర్తింపజేస్తారు. ఈ వివరాలను నోటిఫికేషన్ లో వివరంగా ఇచ్చారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు

తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగ నోటిఫికేషన్
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe