గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు సంతోషంగా ఉంటారు, డబ్బుకి కూడా లోటు ఉండదు. నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.
మాలవ్య రాజయోగం
ఈ రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది, అదృష్టం కూడా పెరుగుతుంది. శుక్రుడు సంతోషం, డబ్బు, అందం, విలాసాలు వంటి వాటికి కారకుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాడు. అలాంటి సమయంలో శుభ యోగాలు ఏర్పడడం సహజం. శుక్రుడు సొంత రాశి అయినటువంటి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో రాజయోగం ఏర్పడనుంది. ఇది పంచ మహాపురుష రాజయోగాల్లో ఒకటి.
ఈ మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నవంబర్ 2న, శుక్రవారం ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం నవంబర్ 26 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కొత్త ఉద్యోగం లభించవచ్చు. అలాగే పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు.. వీరిలో మీరు ఉన్నారా?
1.తులా రాశి:
తులా రాశి వారికి మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ యోగం కారణంగా కొత్త ఉద్యోగం లభించవచ్చు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు, జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఉంటుంది.
2.మకర రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ యోగం కారణంగా కొత్త ఉద్యోగం లభించవచ్చు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు, జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఉంటుంది.
2.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకూ కూడా కలిసి వస్తుంది. మీ పనికి తగ్గ ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు.
3.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎప్పటినుంచో మీ వద్దకు రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. శుభవార్తలు కూడా వింటారు.