వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సంతోషంగా ఉండొచ్చు, ఎలాంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుతూ ఉంటారు. వాస్తుప్రకారం ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చు. మరి వాస్తు ప్రకారం క్రాసులా మొక్క విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి, క్రాసులా మొక్కను ఇంట్లో ఉంచేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుబేరుని అనుగ్రహం

ఇంట్లో క్రాసులా మొక్క ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఇక వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలి?
వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఉండాలి. లేదంటే ప్రతికూల శక్తి కలిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రాసులా మొక్క సరైన దిశలో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయి, ప్రతికూలశక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఈ మొక్కను పెట్టడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
ఏ దిశలో ఉండాలి?
వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తరం వైపుకు రాశుల మొక్క ఉంటే మంచిది, లేదంటే ఈశాన్యం వైపు కూడా ఉండొచ్చు. ఈ దిశలో ఉండడం వలన కూడా కలిసి వస్తుంది.
ఇలాంటి మొక్కను ఇంట్లో పెట్టడం మంచిది కాదు:
వాస్తు ప్రకారం క్రాసులా మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండిపోయినది లేదా ఆకులు కుళ్లిపోవడం మంచిది కాదు. ఎప్పుడు కూడా క్రాసులా మొక్క తాజాగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ సరైన మొక్క ఇంట్లోలేకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం క్రాసులా మొక్క విషయంలో చేయకూడని పొరపాట్లు:
- ఇంట్లో పెట్టేటప్పుడు ఇంటి ముఖద్వారానికి కుడి వైపు పెట్టడం వలన మంచి జరుగుతుంది. అలా చేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు.
- క్రాసులా మొక్కను పెట్టేటప్పుడు సూర్యకిరణాలు దానిపై పడేటట్టు చూసుకోవాలి.
- వాస్తు ప్రకారం క్రాసులా మొక్కను డ్రాయింగ్ రూమ్‌లో లేదా బాల్కనీలో పెడితే కూడా మంచి జరుగుతుంది.
- క్రాసులా మొక్కను బాత్రూంలో, వంటగదిలో పెట్టడం మంచిది కాదు.
- క్రాసులా మొక్క వలన సంతోషంకలిగి సక్సెస్‌ను అందుకోవాలంటే కనీసం వారానికి రెండు మూడు సార్లు నీళ్లు పోయండి, అలాగే కుండిని కూడా శుభ్రంగా ఉంచండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}