గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలను కూడా మార్చుతూ ఉంటాయి. ఆగస్టు1 అంటే ఈరోజు, కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నిజానికి అదృష్టం అంటే ఈ రాశులదే.
శుక్రుడి సంచారంతో ఈ రాశులకు అదృష్టం

శుక్రుడువిలాసాలు, డబ్బు, కళ, ప్రేమ వంటి వాటికి కారకుడు. ప్రతి 23 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 1న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.
కెరీర్‌లో, ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు కనపడతాయి. ఈ సమయంలో మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి వారికి శుక్రుని ఆరుద్ర నక్షత్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ రాశికి ఏ విధంగా ప్రభావం ఉంటుందో చూద్దాం.
1.మేష రాశి
మేష రాశి వారికి శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపార ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదకర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. విద్యార్థులకు ఇది మంచి సమయం. సానుకూల మార్పులు ఉంటాయి.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. శుక్రుని నక్షత్ర సంచారం వల్ల కెరీర్, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అప్పులు తీరిపోతాయి. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్త ఇల్లు లేదా వాహనాల కొనుగోలు చేస్తారు. జీతం పెరుగుతుంది. ప్రమోషన్‌లు రావచ్చు.
3.తులా రాశి
తులా రాశి వారికి కూడా శుక్రుని నక్షత్ర మార్పు శుభదాయకం. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందకరమైన పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కళలు, అభిరుచులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత ఉంటుంది.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}తులా రాశి వారికి కూడా శుక్రుని నక్షత్ర మార్పు శుభదాయకం. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందకరమైన పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కళలు, అభిరుచులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత ఉంటుంది.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}ఈ రాశి వారికి శుక్రుడి నక్షత్రమార్పు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒంటరిగా ఉన్నవాళ్లకు ప్రేమకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.