గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల మార్పుతో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ శుభయోగాలు, అశుభయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.

జ్యోతిష్యశాస్త్రంలో శనిని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. శుక్రుడు శుభగ్రహం. శుక్రుడు విలాసాలు, సంపద మొదలైన వాటికి కారకుడు. జాతకంలో ఈ రెండు గ్రహాలు కూడా వృత్తి జీవితంపైనే కాదు, భౌతిక సుఖాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.
ఈ రాశుల్లో ఉంటూ ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఆగస్టు 26న ఉదయం 6:30కి శని, శుక్రుడుఒకరికొకరు 120 డిగ్రీల దూరంలో ఉంటారు. ఇది మంచి యోగాన్ని ఏర్పరుస్తుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరి ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూడు రాశులకు కలిసి రానున్న గురు శుక్రుల యోగం
1.సింహ రాశి
సింహ రాశి వారికి గురు శుక్రుల యోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలో విద్యార్థులు కూడా శుభవార్తలు వింటారు. ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు కలుస్తాయి, విజయాలను అందుకుంటారు. ఈ రాశి వారు మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం.
2.మేష రాశి
మేష రాశివారికి శని, శుక్రుల యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
3.మీన రాశి
{{/usCountry}}మేష రాశివారికి శని, శుక్రుల యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
3.మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారికి కూడా ఇది మంచి సమయం. శని, శుక్రుల శుభయోగం వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. విజయాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం ఫలిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటే కూడా ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే మంచి సమయం. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కొత్త సమాచారం అందుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.