...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ ట్యాలెంటెడ్.. అన్నిట్లో వారి హవా చూపిస్తారు!

న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. వీరికి రానిది అంటూ ఏమీ ఉండదు, అన్నిట్లో ముందుంటారు. మరి వారిలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు. చూసుకోండి, ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ టాలెంటెడ్‌గా అన్నిట్లో వాళ్ల హవా చూపిస్తారు. ఎక్కువ మందితో స్నేహం చేస్తూ ఉంటారు.

Published on: Jul 4, 2025, 13:00:18 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతి ఒక్కరూ కూడా వారికి అన్నీ వచ్చి ఉండాలని అనుకుంటారు, అన్నిటిలో పర్ఫెక్ట్‌గా ఉండాలని, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలని అనుకుంటారు. కానీ అందరికీ అన్నీ రావు. కొంత మంది మాత్రమే అన్నిట్లో ముందుంటారు. డాన్స్, సింగింగ్ ఇలా అన్నిట్లో కూడా ముందు ఉండే వారు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. దాంతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్నిట్లో కూడా వారి హవా చూపిస్తూ ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అయితే, అన్నిట్లో కచ్చితంగా ముందుంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ ట్యాలెంటెడ్ (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ ట్యాలెంటెడ్ (pinterest)

న్యూమరాలజీప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. వీరికి రానిది అంటూ ఏమీ ఉండదు, అన్నిట్లో ముందుంటారు. మరి వారిలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు. చూసుకోండి, ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ టాలెంటెడ్‌గా అన్నిట్లో వాళ్ల హవా చూపిస్తారు.

సంఖ్య 5

ఐదవ తేదీన పుట్టినవారు ఏ విషయాన్నైనా ఆసక్తితో నేర్చుకుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఏ ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగలరు. ప్రతి అనుభవం నుండి కొత్త పాఠం నేర్చుకుని జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటారు. చురుకుగా ఉంటారు, ఎక్కువ మందితో స్నేహం చేస్తూ ఉంటారు, అందరితో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వీరికి తెలియనిది ఏమీ ఉండదు. ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుని ఉద్యోగం చేస్తున్నా, మిగతా రంగాల్లో కూడా వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది.

సంఖ్య 14

14వ తేదీన పుట్టిన వారు కూడా మల్టీ టాలెంటెడ్‌. వీరికి అన్నీ వచ్చు. మల్టీ టాలెంటెడ్‌గా చూపిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఏమైనా సమస్యవచ్చినప్పుడు దానిని విశ్లేషించి పరిష్కారాలను కనుగొంటారు. భవిష్యత్తు గురించి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులు పెట్టుబడి పెట్టకపోయినా, వీరే పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తారు. ఎల్లప్పుడూ తమ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలని అనుకుంటారు.

సంఖ్య 21

ఏదైనా నెలలో 23వ తేదీన పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. వేటినైనా సులువుగా అర్థం చేసుకుంటారు. లేని విషయాన్ని ఈజీగా తెలుసుకుంటారు. చురుకుగా ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మార్కెటింగ్, టెక్నాలజీ, మ్యూజిక్ లాంటి రంగాల్లో బాగా రాణిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe