...
...
Next Story

ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ధనవంతులు.. శుక్రుని ప్రభావం వల్ల అపారమైన సంపద, ప్రేమ, గౌరవం లభిస్తాయి

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఈరోజు రాడిక్స్ నెంబర్ 6 కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీళ్ళు ఏ వ్యాపారం చేసినా వారికి కలిసి వస్తుంది. వీరు పుట్టుకతోనే ధనవంతులు అవ్వచ్చు.

Published on: Jul 15, 2025, 09:00:18 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఈరోజు రాడిక్స్ నెంబర్ 6 కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్నెంబర్ 6 కి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సంతోషం, విలాసాలకు కారకుడు.

రాడిక్స్ నెంబర్ 6:

ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ధనవంతులు
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ధనవంతులు

ఏదైనా నెలలో6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ప్రేమ, ధనం, సంతోషం, విలాసాలను అందిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు.

సంతోషంగా ఉంటారు

రాడిక్స్ నెంబర్ 6 వారు ఆనందంతో ఉంటారు. ఈ వ్యక్తులు వర్తమానంలోనే ఉంటారు. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా జీవిస్తారు. ఈ వ్యక్తులుఎప్పటికప్పుడు వారిని వారు తీర్చిదిద్దుకుంటారు. వీరి డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంటుంది.

నవ్వుతూ, నవ్విస్తూ

ఈ వ్యక్తుల ప్రేమజీవితం కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినా, ఎవరితోనైనా మాట్లాడినా నవ్వుతూ ఉంటారు. సరదాగా ఉంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోతారు.

డబ్బు

రాడిక్స్ నెంబర్ 6 వారు బాగా సంపాదిస్తారు. ఏ వ్యాపారం చేసినా వారికి కలిసి వస్తుంది. వీరు పుట్టుకతోనే ధనవంతులు అవ్వచ్చు, లేదా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.

చెడు ఆలోచనలు ఉండవు

దేశ-విదేశాల్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ మంచిగానే వుంటారు. చెడే ఉండదు. ఈ తేదీల్లోపుట్టిన వారి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తారు. అసలు చెడు ఆలోచనలు ఉండవు. గొప్ప నాయకులుగా కూడా మారుతారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks