...
...
Next Story

మరి కొన్ని రోజుల్లో శని తిరోగమనం, ఈ 5 రాశుల వారికి 138 రోజుల పాటు ఇబ్బందులు.. తొందరపాటు వద్దు, ఆరోగ్యం జాగ్రత్త!

జూలై 13న శని తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం 138 రోజులు పాటు ఉంటుంది. ఆ తర్వాత శని నవంబర్ 28న నేరుగా సంచరిస్తాడు. శని తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. శని తిరోగమనం శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను రెండింటినీ ఇస్తుంది. 138 రోజులు పాటు శని తిరోగమనం కారణంగా ఇబ్బందులు రావచ్చు.

Published on: Jul 1, 2025, 15:00:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

శని దేవుడు మనం చేసే మంచి వాటికి మంచి ఫలితాలను, చెడ్డ వాటికి చెడు ఫలితాలను అందిస్తాడు. జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

మరి కొన్ని రోజుల్లో శని తిరోగమనం
మరి కొన్ని రోజుల్లో శని తిరోగమనం

జూలై 13న శనితిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం 138 రోజులు పాటు ఉంటుంది. ఆ తర్వాత శని నవంబర్ 28న నేరుగా సంచరిస్తాడు. శని తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. శని తిరోగమనం శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను రెండింటినీ ఇస్తుంది. 138 రోజులు పాటు శని తిరోగమనం కారణంగా ఈ రాశుల వారికి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

శని తిరోగమనంతో 138 రోజులు పాటు ఈ రాశుల వారికి సమస్యలు:

1.మేష రాశి

మేష రాశి వారికి శని తిరోగమనం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ 138 రోజులు మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరి దగ్గర నుంచి అయినా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా శ్రద్ధతో ఏ పనినైనా పూర్తి చేసుకోవచ్చు. జాగ్రత్తలు ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

2.కన్యా రాశి

కన్యా రాశివారికి కూడా శని తిరోగమనం వలన చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు సహనంతో ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఏదైనా గొడవలు వంటివి వస్తే, మీ అంతట మీరే పరిష్కరించుకోవడం మంచిది.

3.మిథున రాశి

మిథున రాశివారికి శని తిరోగమనము వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు, కోపం కూడా ఎక్కువవుతుంది. సహనంతో ఉండాలి, లేదంటే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

4.వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి జూలై నెలలో వచ్చే తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ఫోకస్ పెట్టి పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు అలసటగా కూడా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే తొందరపాటు మంచిది కాదు.

5.ధనుస్సు రాశి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe