...
...
Next Story

జూలైలో సూర్యుడు, బుధుల బుధాదిత్య రాజయోగం, అదృష్టమంటే ఈ మూడు రాశులదే.. ధనం, విజయాలతో పాటు ఎన్నో!

సూర్యుడు గ్రహాలకు రాజు, బుధుడు గ్రహాలకు యువరాజు. సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు పాటు ఉంటాడు. బుధుడు 21 రోజులు తర్వాత తన రాశిని మార్పు చేస్తాడు.ఈ రెండు ఒకే రాశిలో రావడం, అరుదైన యాదృఛ్ఛికం లాంటిది. ఏది ఏమైనా బుధాదిత్య యోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు ఇస్తుంది. మరి మీరూ వీరిలో ఒకరేమో చూసుకోండి.

Published on: Jun 28, 2025, 13:30:09 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో, సూర్యుడు బుధుడి మధ్య స్నేహం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు, బుధాదిత్యయోగం ఏర్పడుతుంది. అనేక రాశుల వారు, ఈ యోగం వలన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడు గ్రహాలకు రాజు, బుధుడు గ్రహాలకు యువరాజు. సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు పాటు ఉంటాడు. బుధుడు 21 రోజులు తర్వాత తన రాశిని మార్పు చేస్తాడు.

జూలైలో సూర్యుడు, బుధుల బుధాదిత్య రాజయోగం (pinterest)
జూలైలో సూర్యుడు, బుధుల బుధాదిత్య రాజయోగం (pinterest)

ఇప్పుడు ఈ రెండు ఒకే రాశిలోరావడం, అరుదైన యాదృఛ్ఛికం లాంటిది. ఇది జూలై నెలలో జరగనుంది. వాస్తవానికి, బుధుడు మేధస్సుకు కారకుడు. ప్రస్తుతం, కర్కాటక రాశిలో ఉన్నాడు. జూలైలో, సూర్యుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో, కొన్ని రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు.

బుధాదిత్య యోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:

1.కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారికి, బుధాదిత్య యోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఈ రాశి వారు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. లవ్ ప్రొపోజల్ కూడా పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా కూడా అనేక లాభాలు వస్తాయి.

2.సింహ రాశి:

సింహ రాశివారికి, బుధుడు అనేక విధాలుగా సహాయపడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలను పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహ రాశి వారికి ఈ సమయంలో సక్సెస్ కూడా అందుతుంది.

3.తులా రాశి:

తులా రాశివారికి, బుధాదిత్య యోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. కొత్త విషయాలను నేర్చుకుంటారు. జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కెరీర్‌లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీరు వేసే ప్రతి అడుగు, విజయానికి దారి తీస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks