...
...
Next Story

ఈ 4 రాశుల వారు దేనికీ పెద్దగా బాధపడరు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారు దేని గురించి పెద్దగా బాధపడరు. ఎల్లప్పుడూ వారు ప్రశాంతంగా ఉండడానికి చూస్తారు. ఈ రాశుల వారు మొండి వారు అని మనం అనొచ్చు. ఏదైనా సమస్య వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, బాధ పడిపోతూ ఉంటారు. మరి అలా ఉండే రాశుల వారు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 4, 2025, 15:00:06 IST
Advertisement

రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పడానికి వీలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని రాశుల వారికి ఇవి బలాలు అయితే, కొన్ని రాశుల వారికి అవే బలహీనత కావచ్చు.

ఈ రాశుల వారు ప్రశాంతంగా వుంటారు

ఈ రాశుల వారు దేనికీ ఎక్కువ బాధపడిపోరు (pinterest)
ఈ రాశుల వారు దేనికీ ఎక్కువ బాధపడిపోరు (pinterest)

జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారు దేని గురించి పెద్దగా బాధపడరు. ఎల్లప్పుడూ వారు ప్రశాంతంగా ఉండడానికి చూస్తారు. ఈ రాశుల వారు మొండి వారు అని మనం అనొచ్చు. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, బాధ పడిపోతూ ఉంటారు, దాని గురించి తలుచుకుని తిండి, తిప్పలు మానేసి బెంగపడిపోతూ ఉంటారు.

కానీ కొంతమంది ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటారు, సమస్యను పెద్దగా పట్టించుకోరు. దాని నుంచి త్వరగా బయటపడిపోవచ్చు అని వదిలేస్తారు. మనశ్శాంతితో ప్రశాంతంగానే ఉంటారు. మరి అలా ఉండే రాశుల వారు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారు దేనికీ ఎక్కువ బాధపడిపోరు, ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు

1.కుంభ రాశి

కుంభ రాశి వారు మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. వీరు ఇతరులు ఏమనుకుంటారు అనేది ఏ మాత్రం పట్టించుకోరు. ఏది మంచి అయితే దానినే చేస్తారు. ఎల్లప్పుడూ ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. పరిస్థితులు ఎలాంటివి ఎదురైనా సరే ప్రశాంతంగానే ఉంటారు.

2.ధనుస్సు రాశి

వృషభ రాశి వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. ఏ విధమైన సమస్య వచ్చినా సరే భయపడరు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదిస్తారు. పెద్ద సమస్య రాకుండా జాగ్రత్త పడతారు.

4.మీన రాశి

మీన రాశి వారు ప్రతి విషయానికి అంతగా భయపడిపోరు. జరిగిందంతా దైవ సంకల్పం అని భావించి ముందుకు వెళ్తారు తప్ప పదే పదే అందులోనే ఉండిపోరు. ఆ విషయాలన్నింటిని తలుచుకుని భయపడడం వీరికి తెలియదు. ఎలాంటి సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటారు. పడిపోవడం, బాధపడిపోవడం, పదే పదే దాని గురించి ఆలోచించి ఆ సమస్యలో కూరుకుపోవడం ఈ రాశి వారికి ఇష్టం ఉండదు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe