...
...
Next Story

కామిక ఏకాదశి నాడు 3 అద్భుతమైన యోగాలు.. ఇలా విష్ణువుని ఆరాధిస్తే సమస్యలన్నీ తీరి ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం బాగుటుంది!

ప్రతి సంవత్సరం ఆషాడ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈసారి కామిక ఏకాదశి ఇంకా ప్రత్యేకము. ఎందుకంటే కామిక ఏకాదశి నాడు అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. కామిక ఏకాదశి నాడు ఎలాంటి యోగాలు ఏర్పడతాయి, వాటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 18, 2025, 07:00:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది. ఈ సంవత్సరం కామిక ఏకాదశి జూలై 21న వచ్చింది. ప్రతి సంవత్సరంఆషాడ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి అంటారు. ఈసారి కామిక ఏకాదశి ఇంకా ప్రత్యేకము. ఎందుకంటే కామిక ఏకాదశి నాడు అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. కామిక ఏకాదశి నాడు ఎలాంటి యోగాలు ఏర్పడతాయి, వాటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.వృద్ధి యోగం:

కామిక ఏకాదశి 2025 (pinterest)
కామిక ఏకాదశి 2025 (pinterest)

శుభకార్యాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వృద్ధి యోగంపురోగతిని తీసుకువస్తుంది, విజయాలను అందిస్తుంది. సంపద కూడా కలిగి, సంతోషంగా ఉండవచ్చు. పరమేశ్వరుడిని కామిక ఏకాదశి నాడు పూజించడం వలన అధిక శ్రేయస్సు కలుగుతుంది.

2.సర్వార్థ సిద్ధి యోగం:

కామిక ఏకాదశినాడు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడింది. ఇది మన కోరికలను తీర్చడానికి సహాయపడుతుంది. ప్రతి పనిలో విజయాన్ని కూడా పొందవచ్చు. సర్వార్థ సిద్ధి యోగం అంటే లక్ష్యాన్ని పూర్తి చేయడం అని అర్థం. ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా పూర్తయిపోతాయి.

3.అమృత సిద్ధి యోగం:

అమృత సిద్ధి యోగం అంటే అమృత్వం, పరిపూర్ణత. ఆ రోజు అమృత సిద్ధి యోగం కూడా ఉండడంతో ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగాఉండవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి.

  • ఇలా కామిక ఏకాదశి నాడు ఈ మూడు యోగాలు రావడం చాలా మంచి విషయం. ఇది చాలా శక్తివంతమైనది కనుక, విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉపవాసము ఉండడం, ఏకాదశి వ్రతం చేయడం మంచిదే.
  • శివుడికి జలాభిషేకం చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. "ఓం నమఃశివాయ" అనే మంత్రాన్ని జపిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. మహా మృత్యుంజయ మంత్రం, రుద్రాక్ష జపం, శివ చాలీసా కూడా పఠించవచ్చు.
  • ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే ఎంతో లాభంకలుగుతుంది. కనుక, పేదలకు అవసరమైన వాటిని దానం చేస్తే పుణ్యాన్ని పొందండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe