...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 19, 2025: ఈరోజు ఈ రాశి వారు వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు, అనుకున్న పనులు పూర్తవుతాయి!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.07.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 19, 2025, 07:00:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : కృ. నవమి, నక్షత్రం : భరణి

మేష రాశి:

మేష రాశివారి ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

వృషభ రాశి:

వృషభరాశి వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యం సాధిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం, గృహ మరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.

మిథున రాశి:

గ్రహస్థితి సామాన్యం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. చుట్టుపక్కల వారిని ఒక కంట కనిపెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి.

కర్కాటక రాశి:

ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అయినవారిని సంప్రదిస్తారు. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్య రాశి:

కన్య రాశి వారి వ్యవహారంలో తొందరపాటు తగదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీపై కొందరు నిఘా పెట్టారని తెలుసుకోండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. విలువైన వస్తువులు జాగ్రత్త.

తుల రాశి:

అన్నివిధాలా అనుకూలమే. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సంతోషకరమైన వార్త వింటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. దైర్యంగా ముందుకు సాగుతారు. పిల్లలకు విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి:

వృశ్చికరాశి వారి పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బంధువులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.

ధనుస్సు రాశి:

ధనుస్సురాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలించే సమయం త్వరలోనే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ధనసహాయం తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయాలు సేకరించేందుకు కొందరు యత్నిస్తారు.

మకర రాశి:

లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. నిపుణుల సలహా పాటించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఇంటి పరిస్థితులపై దృష్టి సారించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

కుంభ రాశి:

కుంభరాశి వారి సంప్రదింపులు ఫలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.

మీన రాశి:

మీన రాశి వారు అన్ని రంగాల వారికీ అనుకూల సమయం. మాట నిలబెట్టుకుంటారు. బంధు, మిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్ద మొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe