...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 20, 2025: ఈరోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.07.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 20, 2025, 04:00:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : కృ. దశమి, నక్షత్రం : కృత్తిక

మేష రాశి:

మేష రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య యత్నాలకు మద్దతు లభించగలదు. గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు పూర్తిచేసుకుంటారు. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలంగా సాగుతాయి. ఆహార, విరామాలకు కాలనియమాలు పాటించండి. ఉద్యోగులకు గుర్తింపులు ఉంటాయి.

వృషభ రాశి:

వృషభరాశి వారు మానసికంగా సంతృప్తిని పొందుతారు. కుటుంబ వ్యక్తులతో ఉత్సాహాలు, ఆలోచనలు పంచుకుంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వాహన, యంత్రాదుల రిపేర్లను ఏర్పరచు సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం తగ్గటమే కాక సమయోచిత లాభాలు పొందుతారు. క్రయ, విక్రయాలకు, స్పెక్యులేషన్‌లకు దూరంగా ఉండండి.

మిథునరాశి:

మిథునరాశి వారు గురుబలాన్ని పెంచుకుంటూ పట్టుదల చూపవలసివుంటుంది. అదృష్టానికి, సహకారాలు పొందుటకు ఆలోచనలు చేయక కర్తవ్యాన్ని గ్రహించుకోవాలి. అవసరాలను సమర్థించుకునే విధంగా ఆదాయాలుంటాయి. భ్రాతృవర్గం, తోటివారితో సంయమనం తప్పనిసరి. ఒప్పందాలు, అగ్రిమెంట్లు వాయిదా వేసుకోండి. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి.

కర్కాటక రాశి:

సింహరాశి వారు అనారోగ్య భావనలు ఎదుర్కోవలసి రావచ్చు. చిన్న పనైనా జాగ్రత్తగా చేసుకోండి. స్నేహవర్గం రాకపోకలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తి ఉంటుంది. చెల్లింపులు కొన్ని పూర్తిచేసుకోగలుగుతారు. కుటుంబ వ్యక్తులకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు, వారికి సహకరించవలసిన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో మంచి అవకాశాలను పొందుతారు.

కన్యా రాశి:

నిత్యకృత్యాలు సకాలంలో జరుగుతాయి. పెద్ద పనులను చేపట్టక రొటేషన్లకు ప్రాధాన్యత ఇవ్వండి. నూతన పరిచయాలు, ప్రయోజనాలు ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు అవసరం. కుటుంబ వ్యవహారాలలో భాగస్వామి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక సర్దుబాట్లకు చేతులు కలిపే అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు.

తులా రాశి:

తులారాశి గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం అవసరం. వ్యాపార, వ్యవహార నిర్వహణలో తెలియని ఆటంకాల వల్ల జాప్యాలు ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకునే సందర్భాలు ఉంటాయి. ఊహించినవి రాక ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్నిటికి సవరణలు, దిద్దుబాట్లు ఉంటాయి.

వృశ్చిక రాశి:

ప్రారంభించిన పనులను పూర్తిచేసుకుంటారు. స్నేహబంధాల కోసం ప్రయత్నిస్తారు. అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. రావలసినవి ఆలస్యంగా వస్తాయి. కుటుంబంలో ఏకవాక్యత వల్ల ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వాహన ఏర్పాట్లు, స్పెక్యులేషన్‌లో చిన్నతరహా లాభాలు పొందుతారు. ప్రభుత్వ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి.

ధనుస్సు రాశి:

ఆటంకాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి మంచి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగాల్లో సంతృప్తి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో చిన్నతరహా జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.

మకర రాశి:

మకరరాశి వారు ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. ఒంటరితనాన్ని ప్రదర్శించడం వల్ల ఏకాకితనం కలగవచ్చు. ఆర్థిక ప్రయోజనాల కోసం హుందాతనాన్ని త్యాగం చేయవలసి ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలను దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల్లో చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కుంభ రాశి:

కుంభరాశి వారు చేపట్టిన పనులను అటూ ఇటూ పూర్తిచేసుకుంటారు. గత పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యక్తిగత విమర్శలను దూరం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తుల వ్యవహారాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తారు. వాహన, యంత్రాల వినియోగంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం.

మీన రాశి:

ప్రయత్న కార్యాలను పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయం చేసి సంతృప్తి పొందుతారు. తరచుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వ్యాపారాల్లో ఉత్సాహం లభిస్తుంది. ఇతరులను సమాధానపరచడానికి సమయ దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు కలసివస్తాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe