...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 21, 2025: ఈరోజు ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.. నిత్యం శక్తి కంకణం ధరించండి

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.07.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 21, 2025, 04:00:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : రోహిణి

మేష రాశి

కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. నిత్యం సర్పదోష నివారణ కంకణం ధరించడం వలన సర్వదోషాలు తొలగిపోతాయి. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీద మీరు చేసుకుపోవడం వలన సానుకూల ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

వృషభ రాశి

వృషభరాశి వారు అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న మీవారిని రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరటను చెందుతారు. కాలం అనుకూలంగా మారుతున్నట్లుగా భావిస్తారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిశులు గంధం వేయండి.

మిథున రాశి

మిథునరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ నిజాయితీని ఋజువు చేసుకోగలుగుతారు. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించండి. వ్యాపారపరంగా లాభాలు రౌటీషన్ల రూపంలో ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి భూవివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిత్యం యంభస్మాన్ని ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. రాజకీయమైన వ్యూహాలు అంతగా లాభించవు.

సింహ రాశి

కన్య రాశి వారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. నిత్యం ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మి కటాక్షం లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

తుల రాశి

బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు వేయడం వలన అన్ని విధాలా మంచిది. రుణాలు తీరుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. ప్రముఖుల నుండి వచ్చిన వార్త వలన కొంత సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి రాజకీయ, కళారంగాలలో ఉన్న వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిత్రులు సైతం శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించడం వలన మేలు జరుగుతుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థానచలనముంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రథమ తాంబూలం వాడండి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు.

మకర రాశి

రాజకీయ, కళారంగాలలో ఉన్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అయినప్పటికీ చివరకు పూర్తి చేస్తారు. ఋణాలు తీర్చుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ చాలా అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిత్యం శక్తికంకణం ధరించండి.

కుంభ రాశి

కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నిత్యం సౌరకంకణం ధరించండి.

మీన రాశి

మీన రాశి వారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలలో ఉన్న వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe