...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 06, 2025: ఈరోజు ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండాలి.. నుదిటిపై నాగ సింధూరం ధరించడం!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.07.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 6, 2025, 04:00:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : విశాఖ

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు నూతన విషయాలు తెలుసుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మహాతీర్థం పొడితో చేసే అభిషేకాలు, స్వశక్తితో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక, క్రీడా రంగాలలోని వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో కొంతవరకు తొలగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రధను తాంబూలం ఉపయోగించదగినది.

మిథున రాశి

మిథునరాశి వారికి ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. నిత్యం అరటినార వత్తులు అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం అన్ని విధాలా మంచిది. వృత్తి సంబంధమైన వ్యవహారాలలో ఒత్తిడి అధికం అవడం వల్ల శరీరం అలసటకు గురౌతుంది.

కర్కాటక రాశి

సింహరాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసిన స్థితి వస్తుంది. నిత్యం లక్ష్మీ తామర వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారంలో పలుమార్పులు చేసి లాభపడతారు. చాలా కాలం పరిష్కారం కాని సమస్యలు కొంత మేర మీకు అనుకూలమౌతాయి.

కన్య రాశి

కన్యరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కళా, సాహిత్య, క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్యప్రాప్తికి ఈ లక్ష్మీచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. ఉద్యోగాలలో మీపై అధికారుల వత్తిడి అధికం అవుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

తుల రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కళా, సాహిత్య రంగాలలో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు, మదుపులు మొదలగునవి అనుకూలిస్తాయి. సంతానం విద్యా విషయంలో కొంత ఆందోళన తప్పదు. నిత్యం సర్వదోష నివారణ చూర్ణముతో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయటం వలన సర్వదోషాలు మరియు గ్రహాల వల్ల కలుగు బాధలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం ఉంటుంది, జాగ్రత్త వహించండి. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించండి. స్వంత విషయమై అధిక ఖర్చులు చేస్తారన్న విమర్శలకు సంఘటనలే సమాధానమును చెబుతాయి. పాస్‌పోర్టు, వీసాలకు సంబంధించిన విషయాలలో సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రభుత్వ పరమైన రాయితీలు, మినహాయింపులు, బిల్లులకు సంబంధించిన కన్సెషన్లను చట్ట నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న ఆధారాన్ని పట్టుకొని సానుకూల ఫలితాలను సాధిస్తారు. నిత్యం తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం వలన మేలు జరుగుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ సమస్యను కదల్చి వేస్తాయి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఏది ఏమైనా వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్, లైసెన్స్ల పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. నిత్యం నాగ సింధూరం నుదిటిపై ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మొండికేసిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కాకుండానే స్వాధీనంలోకి రావడం జరుగుతుంది. ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీలకు సంబంధించిన వివాదాలలో మీ పేరును లాగబడే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు అనవసరమైన పరిశీలనలు ఉండడం చేత ప్రశాంతత తగ్గుతుంది. మీకు న్యాయం చేయవలసిన వారు సంపూర్ణంగా న్యాయం చేయరు. కోర్టు సంబంధిత భూవివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. అరటినార వత్తులు అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం వలన అన్ని విధాలా మంచిది. ఇటు బయటా అనుకూలం.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe