...
...
Next Story

గురు పౌర్ణమి జూలై 10న, 11న? సరైన తేదీ, పూజా సమయంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి

గురు పౌర్ణమి నాడు వేదవ్యాసుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించాలి. గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని చాలా మంది సందేహంలో పడ్డారు. గురు పౌర్ణమి తేదీ గురించి, పూజ సమయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 7, 2025, 07:00:19 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

వేదవ్యాసుడు మహాభారతం, శ్రీమద్భాగవతం, 18 పురాణాలను రచించారు. వేద వ్యాసుడు పూర్ణిమి నాడు జన్మించారు. ప్రపంచంలోనే ఆయనను మొదటి గురువుగా భావిస్తారు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. దీనిని వ్యాస పౌర్ణమి, వేదవ్యాస జయంతి అని కూడా అంటారు.

గురు పౌర్ణమి 2025 (pinterest)
గురు పౌర్ణమి 2025 (pinterest)

గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించడం చాలా మంచిది. అదే విధంగా, గురు పౌర్ణమి నాడు పుణ్య నదుల్లో స్నానంచేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. గురువులకు కానుకలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం కూడా శుభప్రదం.

గురు పౌర్ణమి 2025

గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని చాలా మంది సందేహంలో పడ్డారు. గురు పౌర్ణమి తేదీ గురించి, పూజసమయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రెండు రోజులు ఉండడం వలన కాస్త తేదీ విషయంలో సందేహం ఉంది. అయితే, గురు పౌర్ణమి జూలై 10న జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు.

గురు పౌర్ణమి శుభ ముహూర్తం:

బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:00 నుంచి 4:50 వరకు

అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:54 వరకు

విజయ ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు

గురు పౌర్ణమి పూజా విధానం:

గురు పౌర్ణమి నాడు ఈ విధంగా పూజ చేయడం వలన మంచి జరుగుతుంది. ఆ రోజు గురువుకు నమస్కారం చేయాలి. అదే విధంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఈ శుభదినాన వేదవ్యాసుడిని కూడా ఆరాధిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe