...
...
Next Story

నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, జూన్ 6న లేదా 7న? ఆ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకోండి!

24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశిలకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకనే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకోండి.

Published on: May 30, 2025, 09:00:13 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

హిందూ మత విశ్వాసాల ప్రకారం, విష్ణువు మొత్తం 24 ఏకాదశులు సృష్టించాడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును ఆరాధించడం వలన శుభం ఫలితాన్ని పొందవచ్చు. 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశిలకు ఎంతో ప్రత్యేకత ఉంది.

నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది (pinterest)
నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది (pinterest)

జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకనే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. 24 ఏకాదశి ఉపవాసాలు పాటించినంత పుణ్యం వస్తుంది.

నిర్జల ఏకాదశి ఉపవాసం ఏ రోజు చేయాలి?

అయితే, ఈ ఏకాదశితిధి రెండు రోజులు రావడం వల్ల నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఏ రోజు చేయాలి? అనే అనుమానం అందరిలో ఉంది. జూన్ 6న చేయాలా? లేదంటే 7న చేయాలా? అని సందిగ్ధంలో పడ్డారు. మరి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? నిర్జల ఏకాదశి వ్రత పూజలు ఏ రోజు చేస్తే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి ఎప్పుడు?

పంచాంగంప్రకారం ఏకాదశి తిథి జూన్ 6వ తేదీన అర్దరాత్రి 2:15 గంటలకు మొదలవుతుంది. జూన్ 7 ఉదయం 7:47 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే, నిర్జల ఏకాదశి ఉపవాసం జూన్ 6, శుక్రవారం నాడు చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నీరు తాగకుండా 32 గంటల పాటు ఉండాల్సి ఉంటుంది.

ఈసారి నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది

ఈసారి నిర్జల ఏకాదశికి ఎంతో ప్రత్యేకత వుంది. త్రిపుష్కర యోగం, శివయోగం, స్వాతి నక్షత్రాల కలయిక ఉన్నందున దీనిని ప్రత్యేకంగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం వలన అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

భీమసేని ఏకాదశి, పాండవ ఏకాదశి

ప్రజలు ఏకాదశి వ్రతం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశిని భీమసేని ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం చేసిన తర్వాత దానధర్మాలు చేస్తే మంచిది. అలా చేయడం వలన ఉపవాసం యొక్క పూర్తి ఫలితం వస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks