జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 52 ఉద్యోగాలున్నాయి. https://gmcjangaon.org/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి. కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 23 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వీటిలో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, రేడియో-డయాగ్నోసిస్, ఆర్థోపెడిక్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్,రెస్పిరేటరీ మెడిసిన్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఎపిడెమియాలజిస్ట్ విభాగాలున్నాయి. దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు.…. 31-03-2025 నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనగాం
- ఉద్యోగ ఖాళీలు - 52
- ఖాళీల వివరాలు - ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 13, సీనియర్ రెసిడెంట్ - 23
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్ చేసుకొని ఉండాలి.
- ఇంటర్వ్యూ తేదీ: 6-11-2025.
- ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం : ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, 2వ అంతస్తు, ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్, జనగామ.
ఇంటర్వ్యూకి తీసుకురావాల్సి పత్రాలు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- పుట్టిన తేదీ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి వరకు)
- ఎంబీబీఎస్/ MD/MS/DNB డిగ్రీ సర్టిఫికెట్లు
- మార్కుల మెమోలు
- ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం
- ఉద్యోగానుభవానికి సంబంధించిన పత్రాలు
- నోటిఫికేషన్ లో పేర్కొన్న ఇతర పత్రాలు