...
...
Next Story

TG ICET 2026 Results : టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG ICET 2026 Results : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ (TG ICET-2026) ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jun 12, 2026 04:04 PM IST
Advertisement

TG ICET 2026 Results : రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘టీజీ ఐసెట్-2026’ (TG ICET) ఫలితాలు విడుదలయ్యాయి. నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సమావేశ మందిరంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల
టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల

ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులకు సంబంధించిన మార్కులు, ర్యాంకులతో కూడిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి వివరాలతో వీటిని చెక్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్ 2026 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండ

  1. అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.
  2. హోం పేజీలోని డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయండి.
  3. ఇక్కడ ఐసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్‌మెంట్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి త్వరలోనే ప్రకటించనుంది. ప్రవేశాల ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు వంటి తదుపరి అప్‌డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఐసెట్ - 2026 ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe