...
...
Next Story

Telangana : ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా - రూ.4.5 లక్షలు కాజేసి అత్యాచారం! ఆపై కారులో నుంచి...

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి…. మహిళ నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేశాడు. రిసార్ట్‌లో లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా… కదులుతున్న కారు నుంచి సదరు మహిళను తోసివేశాడు.

Published on: Oct 27, 2026, 06:50:27 IST
Advertisement

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఆశచూపిన ఓ వ్యక్తి… 30 ఏళ్ల మహిళ నుంచి లక్షలాది రూపాయలు కాజేశాడు. ఆమెపై రిసార్ట్‌లో లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. కదులుతున్న కారు నుంచి హైవేపైకి నెట్టివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఘట్‌కేసర్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఉద్యోగం ఆశచూపి రూ.4.5 లక్షలు వసూలు

ప్రతీకాత్మక చిత్రం (Image Source Pixel)
ప్రతీకాత్మక చిత్రం (Image Source Pixel)

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన జగన్మోహన్ అనే వ్యక్తికి దాదాపు నాలుగు నెలల క్రితం ఫోన్ ద్వారా సదరు బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తాను భువనగిరి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న నిందితుడు… మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఈ ఉద్యోగం కోసం ఓ ఉన్నతాధికారికి రూ.5 లక్షలు లంచంగా చెల్లించాలని నమ్మబలికాడు.

ఆ నిందితుడి మాటలను పూర్తిగా నమ్మిన బాధితురాలు.. ఎంతో కష్టపడి రూ.4.5 లక్షల నగదును సమకూర్చుకుంది. నగదు సిద్ధం కావడంతో అక్టోబర్ 26న నిందితుడు జగన్మోహన్ తన కారులో మల్లాపూర్‌లోని రత్నదీప్ వద్దకు చేరుకుని ఆమెను ఎక్కించుకున్నాడు. భువనగిరి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తున్నామని చెప్పిన నిందితుడు, మార్గమధ్యలోనే ఆమె వద్ద ఉన్న రూ.4.5 లక్షల నగదును తీసుకుని కారు డాష్‌బోర్డ్‌లో పెట్టాడు.

ఆఫీసు అని చెప్పి రిసార్ట్‌కు.. ఆపై దారుణం

మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లకుండా, కారును ఔషాపూర్‌లోని శ్రీనిధి రిసార్ట్‌కు మళ్లించాడు. ఉద్యోగం ఇచ్చే ఉన్నతాధికారి రిసార్ట్‌లోని ఒక గదిలో వేచి ఉన్నారని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లిన వెంటనే జగన్మోహన్ ఆమెపై తీవ్రంగా భౌతిక దాడులకు దిగి లైంగికంగా వేధించాడు.

తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు జగన్మోహన్‌పై వివిధ చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఘటనకు సంబంధించి శ్రీనిధి రిసార్ట్ పరిసరాల్లోని సీసీటీవీ విజువల్స్, ఆధారాలను సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.

 
SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks