మన్యం జిల్లాలో వికటించిన కల్లు - 15 మందికి అస్వస్థత

వికటించిన కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురుయ్యారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోని వనకబడి గ్రామంలో వెలుగు చూసింది. ప్రస్తుతం వీరందరికీ చికిత్స అందుతోంది.

Published on: Jan 18, 2026, 13:07:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో వికయించిన కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురికి వాంతులు, విరేచనాలతో సహా తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత వారి పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే వీరిని కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కల్తీ కల్లు ఘటన - 15 మందికి అస్వస్థత
కల్తీ కల్లు ఘటన - 15 మందికి అస్వస్థత

కురుపం మండల పరిధిలోని వనకబడి గ్రామంలో వికటించిన కల్లు తాగి పలువురు అనారోగ్యానికి గురయ్యారని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తీవ్రమైన విరేచనాలతో బాధపడుతున్న నలుగురిని చికిత్స నిమిత్తం కురుపం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు.

ఈ ఘటన జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అవసరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో జె.నీలకంఠం (37), పువ్వాల రామ్ సింగ్ (25), జె.జోగారావు (38), జె.భూషణరావు (54)ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే జె. జోగారావుకు బీపీ సమస్య ఉండటంతో… ప్రత్యేకంగా వైద్యుల పరిశీలనలో ఉన్నారు.

బాధితులు నివసిస్తున్న వనకబాడి గ్రామంలో అత్యవసర వైద్య శిబిరం నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఇతరులకు తీవ్రమైన లక్షణాలు కనిపించకపోయినా… ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు వారికి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని…. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారని ఆయన తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More