...
...
Next Story

AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు - నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP High Court Recruitment 2026 : ఏపీలోని ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Published on: Mar 30, 2026, 07:27:51 IST
Advertisement

ఏపీ హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్స్‌, ఎంట్రీ ఆపరేటర్స్‌,ఆఫీస్ సబార్డినెట్, టైపిస్ట్, ఎగ్జామినర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినెట్ పోస్టులున్నాయి. అత్యధికంగా అసిస్టెంట్ ఖాళీలు 78 ఉన్నాయి.

నేటి నుంచి దరఖాస్తులు…

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు (image source istock)
ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు (image source istock)

ఈ పోస్టుల భర్తీకి నేటి నుంచి (మార్చి 30) ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://aphc.gov.in/index.php వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

పోస్టులను అనుసరించి విద్యా అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులను 7వ తరగతి ఉత్తీర్ణతతోనే భర్తీ చేస్తారు. మరికొన్ని పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్, లా డిగ్రీ వంటి అర్హతలు ఉండాలి. టైపింగ్ పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా… షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లు నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ నాల్డెజ్, మెంటల్ ఎబిలిటీ వంటి వాటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉండగా.. 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.

గరిష్ఠ వయోపరిమితి చూస్తే…. 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 400 చెల్లించాలి.

హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు :

2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ - 1

3. కంప్యూటర్ ఆపరేటర్ - 31

4. అసిస్టెంట్ లైబ్రేరియన్ - 1

5. లైబ్రేరియన్ గ్రేడ్-II -1

6. UD స్టెనోగ్రాఫర్ -7

7. అసిస్టెంట్ - 78

8. ఎగ్జామినర్ - 27

9. టైపిస్ట్ - 44

10. కాపీయిస్ట్ - 34

11. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 50

12. స్టెనోగ్రాఫర్ - 1

13. ఆఫీస్ సబార్డినేట్ - 20.

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చూడొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe