అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యంత భయాందోళనకర ఘటన వెలుగుచూసింది. తరగతి గదిలో ఉన్న పదో తరగతి బాలికపై ఓ ఉన్మాది పదునైన రంపంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఉదయాన్నే అందరూ చూస్తుండగానే పాఠశాల కాంపౌండ్‌లోకి ప్రవేశించిన సదరు దుండగుడు…. నేరుగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న పదో తరగతి విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని రంపంతో దారుణంగా కోశాడు.

ఈ ఊహించని ఘాతుకంతో పాఠశాల ఆవరణ అంతా ఒక్కసారిగా కేకలు, భయాందోళనలతో అట్టుడికిపోయింది. దారుణ దాడి కారణంగా సదరు బాలిక కుడిచేయి తెగిపడిపోగా, ముఖం మరియు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న చిన్నారిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆస్పత్రికి తరలింపు…
పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
పాఠశాల ప్రాంగణంలోకి ఆయుధంతో ఉన్మాది ప్రవేశించి క్లాస్ రూమ్‌లోనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన ఉన్మాదిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై క్లాస్ టీచర్ స్పందిస్తూ… సెకండ్ హవర్ క్లాస్ జరుగుతుండగా దుండగుడు వచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా దుండగుడు రావడంతో విద్యార్థులు పరుగులు తీశారని… దుండగుడు ఒక్కడే వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించింది.
కఠినంగా శిక్షించాలి - సీఎం ఆదేశాలు
రాప్తాడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితిపై ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
{{/usCountry}}రాప్తాడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితిపై ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
{{/usCountry}}ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
పోలీసుల అదుపులో నిందితుడు..!
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ధర్మవరంలో దొరికినట్లు తెలిసింది.