అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం - టెన్త్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేశాడు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యంత భయాందోళనకర ఘటన వెలుగుచూసింది. తరగతి గదిలో ఉన్న పదో తరగతి బాలికపై ఓ ఉన్మాది పదునైన రంపంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఉదయాన్నే అందరూ చూస్తుండగానే పాఠశాల కాంపౌండ్‌లోకి ప్రవేశించిన సదరు దుండగుడు…. నేరుగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న పదో తరగతి విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని రంపంతో దారుణంగా కోశాడు.

ఈ ఊహించని ఘాతుకంతో పాఠశాల ఆవరణ అంతా ఒక్కసారిగా కేకలు, భయాందోళనలతో అట్టుడికిపోయింది. దారుణ దాడి కారణంగా సదరు బాలిక కుడిచేయి తెగిపడిపోగా, ముఖం మరియు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న చిన్నారిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆస్పత్రికి తరలింపు…
పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
పాఠశాల ప్రాంగణంలోకి ఆయుధంతో ఉన్మాది ప్రవేశించి క్లాస్ రూమ్‌లోనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన ఉన్మాదిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై క్లాస్ టీచర్ స్పందిస్తూ… సెకండ్ హవర్ క్లాస్ జరుగుతుండగా దుండగుడు వచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా దుండగుడు రావడంతో విద్యార్థులు పరుగులు తీశారని… దుండగుడు ఒక్కడే వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించింది.
కఠినంగా శిక్షించాలి - సీఎం ఆదేశాలు
రాప్తాడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితిపై ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
పోలీసుల అదుపులో నిందితుడు..!
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ధర్మవరంలో దొరికినట్లు తెలిసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

