Macherla Road Accident : మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆగివున్న లారీని ఢీకొట్టిన తూఫాన్, నలుగురు మృతి!
Macherla Road Accident : పల్నాడు జిల్లా మాచర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని తూఫాన్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Macherla Road Accident : పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నగరవనం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లారీని, వేగంగా దూసుకొచ్చిన తూఫాన్ వాహనం వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు దూసుకుపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు, గాయపడిన వారు వాహనం లోపలే ఇరుక్కుపోయారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి, గ్యాస్ కట్టర్ల సాయంతో వాహన భాగాలను కట్ చేసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక వాహనం అతివేగంగా ప్రయాణించడం వల్ల నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

