ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇది రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం… బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి - మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని కూడా సూచించింది.
తెలంగాణకు భారీ వర్ష సూచన…
ఇక తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయి. ఇక ఈనెల 23వ తేదీన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేచ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఈనెల 24వ తేదీన పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈనెల 25వ తేదీన పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక ఇవాళ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}ఇక ఇవాళ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}