మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ట్రావెల్స్ బస్సు దగ్ధం, 13 మంది మృతి

Rayavaram Bus Accident : మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో టిప్పర్‌- ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

Published on: Mar 26, 2026, 07:17:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. 15 మంది గాయపడగా… వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా చెలరేగినట్లు తెలిసింది.

ప్రాథమిక సమచాారం మేరకు… ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్‌ ఢీకొట్టినట్లు తెలిసింది. బస్సు వెనుక భాగంలో ఉన్నవారే ఎక్కువగా చనిపోయారు. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

సమచాారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

బస్సు నుండి మరిన్ని మృతదేహాలను వెలికితీయాల్సి ఉందని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్… ఈ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిందని తెలిపారు. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు.

సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి :

రాయవరం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి.. ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్సను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More