...
...
Next Story

శ్రీసిటీలో ఘోర ప్రమాదం… బాయిలర్‌ పేలి మంటలు, ఇద్దరు కార్మికులు మృతి..!

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు.

Published on: Oct 3, 2026, 09:57:56 IST
Advertisement

తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన శ్రీసిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తర్వాత ఇక్కడ ఉన్న ఓ ప్రైవేట్ ఫార్మా పరిశ్రమలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగింది?

శ్రీసిటీలో ఘోర ప్రమాదం… బాయిలర్‌ పేలి మంటలు, ఇద్దరు కార్మికులు మృతి..!
శ్రీసిటీలో ఘోర ప్రమాదం… బాయిలర్‌ పేలి మంటలు, ఇద్దరు కార్మికులు మృతి..!

శ్రీసిటీలోని 'టిల్ హెల్త్ కేర్' పరిశ్రమలో శుక్రవారం రాత్రి కార్మికులు ఎప్పటిలాగే తమ నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్నారు. అయితే అర్థరాత్రి సమయంలో ఉన్నపళంగా ప్లాంట్‌లోని బాయిలర్/రియాక్టర్ విభాగంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ప్లాంట్ ఆవరణ తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై విచారణకు ఆదేశం

ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అసలు బాయిలర్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక నిర్వహణ లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ అధికారులు, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో శ్రీసిటీలోని ఇతర పారిశ్రామిక యూనిట్లలో తీవ్ర కలకలం రేగింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks