ఆంధ్రప్రదేశ్ : రిటైర్డ్ ఇంజినీర్ పై ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తులు గుర్తింపు..!

విశాఖపట్నానికి చెందిన పంచాయతీరాజ్ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా ఆస్తులను గుర్తించారు.

Published on: Feb 06, 2026 12:33 PM IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నానికి చెందిన పంచాయతీరాజ్ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో అతనికి సంబంధించిన పలుచోట్ల సోదాలు నిర్వహించగా… భారీగా ఆస్తులు బయటపడ్డాయి.

ఏసీబీ సోదాలు - భారీగా ఆస్తులు గుర్తింపు
ఏసీబీ సోదాలు - భారీగా ఆస్తులు గుర్తింపు

నెల రోజుల కిందంటే రిటైర్డ్ అయిన సూపరిండెంటింగ్ ఇంజినీర్(ఎస్‌ఈ) కల్లేపల్లి శ్రీనివాసరావు ఇళ్లపై ఏకకాలంలో 5 చోట్ల గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధురవాడలోని నివాసంతో పాటు సాలూరు, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.

ఏసీబీ సోదాలు - భారీగా ఆస్తులు గుర్తింపు

  • 3 హౌస్ సైట్స్
  • 2 రెసిడెన్షియల్ ఫ్లాట్స్
  • 18.57 ఎకరాల వ్యవసాయ భూమి
  • రూ.61.87 లక్షల నగదు
  • హ్యుందయ్ కారు, బైక్, ఖరీదైన గృహోపకరణాలు
  • సుమారు రూ.4 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం
  • సుమారు రూ.50 లక్షల విలువైన 20.3 కేజీల వెండి

ఈ సోదాల్లో మరో 5 బ్యాంక్ లాకర్ల తాళాలు చిక్కాయి. వీటిని ఇవాళ తెరిచేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. వీటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని తెలుస్తోంది.దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు. ఈ అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.