...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌లో 120 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టింది ఏసీబీ.

Published on: Nov 5, 2025, 15:40:16 IST
Advertisement

రాష్ట్రంలో ఏకకాలంలో 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అవినీతి జరుగుతుందన్న సమాచారం ఒకేసారి 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపుదాడులు చేశారు. వివిధ పనుల కోసం వస్తున్న జనాల దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు మెుదలుపెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నరసరావుపేట, ఒంగోలు, ఆళ్లగడ్డ, విశాఖతోపాటుగా మెుత్తం 120 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు అధికారులు. స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. కీలక డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. అంతేకాదు కార్యాలయంలో అనధికారికంగా ఉన్నవారి గుర్తించి ప్రశ్నించారు.

విశాఖపట్నంలోని మధురవాడ, భోగాపురం, టర్నర్ చౌల్ట్రీ, పెడగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ ప్రాంతాల్లో అవినీతి జరుగుతున్నట్టుగా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడి చేశారు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోదాలు చేశారు.

ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గురించి వరుసగా ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. అవినీతి జరుగుతుందని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. దీంతో దాడి చేసి కార్యాలయం తలుపులు మూసివేసి కీలక దస్త్రాలను పరిశీలించారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో అనధికారికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. రిజిస్ట్రర్లు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe