...
...
Next Story

AP New Pensions : కొత్త పింఛన్లపై సర్కార్ ఫోకస్ - అక్టోబరు నుంచే మంజూరు! త్వరలోనే దరఖాస్తులు!

Andhrapradesh New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబరు నుంచి దశలవారీగా అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Published on: Sep 4, 2026, 13:19:21 IST
Advertisement

Andhrapradesh New Pensions : ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన పేద ప్రజలకు నూతన పెన్షన్లను అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన అర్హులందరికీ అక్టోబరు నెల నుంచే కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేసింది.

పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్
పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్

కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను స్వర్ణ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా మరో రెండు, మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరీల పింఛన్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

సీఎం ఆమోదంతో తుది నిర్ణయం

ఏయే కేటగిరీల పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తులు స్వీకరించాలి, వాటి పరిశీలన ఎలా ఉండాలి అనే అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సెర్ప్ (SERP) ఉన్నతాధికారులు గురువారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ వివరాలతో అధికారులు నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) పంపించారు. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం పొందిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ లేదా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

మరోవైపు, అందిన దరఖాస్తుల సంఖ్యను బట్టి అర్హులందరికీ ఒకేసారి పింఛన్లు అందించాలా లేక విడతల వారీగా మంజూరు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.

మంత్రులతో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా, దశలవారీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe