...
...
Next Story

అన్నమయ్య జిల్లా : మదనపల్లి చిన్నారి హత్య ఘటన - చెరువులో శవమై తేలిన నిందితుడు…!

మదనపల్లిలో జరిగిన 7 ఏళ్ల చిన్నారి హత్య కేసులోని నిందితుడు మృతి చెందాడు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై తేలాడు.

Published on: Feb 18, 2026, 09:25:10 IST
Advertisement

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. కురబాలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ముదివేడు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

మదనపల్లిలో చిన్నారి హత్య ఘటన - నిందితుడు మృతి
మదనపల్లిలో చిన్నారి హత్య ఘటన - నిందితుడు మృతి

మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి దొరకలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్‌ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్‌ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్‌ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృత దేహం కనిపించింది.

చిన్నారిపై నిందితుడు లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలిక ఇంటి పక్కనే ఉండే కులవర్ధన్ మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. పోస్టుమార్టం జరిగిన తర్వాత బాలిక మరణానికి కారణాలు చెబుతామని పోలీసులు చెప్పారు.

ఇదిలా ఉండగానే ఇవాళ నిందితుడు కులవర్ధన్ శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

హోంమంత్రి పరామర్శ

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe