AIIMS Mangalagiri Recruitment : ఎయిమ్స్‌ మంగళగిరిలో ఉద్యోగాలు - నెలకు రూ.60 వేలకుపైగా జీతం! నోటిఫికేషన్ వివరాలు

AIIMS Mangalagiri Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌ (AIIMS) నుంచి వివిధ వైద్య విభాగాల్లో 28 సీనియర్ రెసిడెంట్/సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఖాళీలకు నవంబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

Published on: Nov 1, 2026, 10:47:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AIIMS Mangalagiri Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ / సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు
మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు

ఈ నియామకాలు గరిష్ఠంగా 3 ఏళ్ల కాలానికి (రెస్సిడెన్సీ స్కీమ్ కింద) తాత్కాలిక ప్రాతిపదికన జరుగుతాయి. ప్రతి సంవత్సరం అభ్యర్థి పనితీరును సమీక్షించి గడువును పొడిగిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2026 నవంబరు 21వ తేదీ శనివారం లోపు ఆన్‌లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • అనస్థీషియాలజీ: 5 పోస్టులు
  • అనాటమీ: 1 పోస్టు
  • కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్: 1 పోస్టు
  • డెంటిస్ట్రీ: 2 పోస్టులు
  • ఈఎన్‌టీ : 1 పోస్టు
  • ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ: 1 పోస్టు
  • జనరల్ మెడిసిన్: 2 పోస్టులు
  • జనరల్ సర్జరీ: 1 పోస్టు
  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 1 పోస్టు
  • మైక్రోబయోలాజీ: 2 పోస్టులు
  • నెఫ్రాలజీ: 1 పోస్టు
  • న్యూక్లియర్ మెడిసిన్: 1 పోస్టు
  • పీడియాట్రిక్స్: 1 పోస్టు
  • పాథాలజీ: 1 పోస్టు
  • ఫార్మకాలజీ: 1 పోస్టు
  • ఫిజియాలజీ: 1 పోస్టు
  • సైకియాట్రీ: 1 పోస్టు
  • రేడియేషన్ ఆంకాలజీ: 1 పోస్టు
  • రుమటాలజీ: 1 పోస్టు
  • ట్రామా అండ్ ఎమర్జెన్సీ: 2 పోస్టులు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత వైద్య విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, డీఎన్ బీ, డీఏం లేదా M.Ch పూర్తి చేసి ఉండాలి. నాన్-మెడికల్ పోస్టులకు (అనాటమీ, ఫార్మకాలజీ) సంబంధిత విభాగంలో M.Sc / M.Biotech తో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన వారు అర్హులు.

  • మెడికల్ అభ్యర్థులకు రూ. 67,700 ప్రారంభ వేతనంతో పాటు NPA (నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్) మరియు ఇతర భత్యాలు లభిస్తాయి. నాన్-మెడికల్ అభ్యర్థులకు లెవెల్-10 కింద ప్రారంభ వేతనం రూ. 56,100 మరియు ఇతర భత్యాలు అందిస్తారు.
  • దరఖాస్తు ముగింపు తేదీ (21 నవంబర్ 2026) నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు.
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు లభిస్తుంది.

అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే జరుగుతుంది. అయితే దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో (MCQs) స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, అందులో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం

ఆసక్తి గల అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ (www.aiimsmangalagiri.edu.in) లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి. సంబంధిత సర్టిఫికేట్లు మరియు ఫీజు రసీదులను అప్‌లోడ్ చేయాలి. ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ ధ్రువపత్రాల నమూనాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లేదా సగం ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) అందజేయాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More