విద్యార్థులకు అలర్ట్.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోటీలు.. గెలిస్తే బహుమతులు
విశాఖపట్నంలో పాఠశాల విద్యార్థుల కోసం జూన్ 4న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు జరగనున్నాయి. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ నంబర్లు ఇక్కడ చూడండి.
విశాఖపట్నంలోని పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(APPCB) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. జూన్ 5న జరగబోయే 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' (World Environment Day) పురస్కరించుకుని, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 4వ తేదీన విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం” (Inspired by Nature. For Climate. For Our Future) అనే ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడం, పర్యావరణ హితమైన స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.
మాధవధార హౌసింగ్ బోర్డు కాలనీలోని ఏపీపీసీబీ ప్రాంతీయ కార్యాలయంలో జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ పోటీలు ప్రారంభమవుతాయి. విద్యార్థుల వయసు ఆధారంగా రెండు విభాగాలుగా పోటీలను నిర్వహిస్తున్నారు. జూనియర్ విభాగం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉంటుంది. సీనియర్ విభాగంలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పోటీలకు హాజరుకావొచ్చు. వక్తృత్వం (Elocution), వ్యాస రచన (Essay Writing), డ్రాయింగ్ / చిత్రలేఖనం (Drawing), క్విజ్ (Quiz) పోటీలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది పోటీలలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యమయ్యేలా ఒక ప్రత్యేకమైన క్రియేటివ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య పర్యావరణ స్పృహను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ పోటీలు పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ముఖ్యంగా: సర్క్యులర్ ఎకానమీ (వ్యర్థాల పునరుత్పత్తి ఆర్థిక వ్యవస్థ), ప్లాస్టిక్ కాలుష్యం - నిర్మూలన చర్యలు, పర్యావరణ అవగాహన, సుస్థిర జీవన విధానంపై ఉంటుంది.
ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా ఇతర వివరాల కోసం పేర్కొన్న ఫోన్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు: 99086 67273, 98851 35582, 77801 64110 కాల్ చేయండి.
పోటీలలో పాల్గొనే విద్యార్థులు డ్రాయింగ్‌కు సంబంధించిన కలర్స్, ప్యాడ్స్ వంటి మెటీరియల్‌ను స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. విజేతలకు జూన్ 5న జరిగే ప్రధాన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వైజాగ్ విద్యార్థులకు ఇది ఒక చక్కని వేదిక.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


